తండ్రి కొడుకులకు వికెట్ కీపింగ్ చేసిన ధోని.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

మహేంద్రసింగ్ ధోని.ప్రపంచ క్రీడా రంగంలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Ms Dhoni Connection Between Riyan Parag And His Father Parag Das, Parag Das, Ri-TeluguStop.com

టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలను అందించిన ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని.అయితే ధోనికి, అలాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.20 సంవత్సరాల క్రితం ఓ చిన్న పిల్లోడు గా ఉన్న రియాన్ పరాగ్ ధోనీతో కలిసి ఆ సమయంలో ఓ ఫోటో దిగాడు.అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న పరాగ్ తో కలిసి మరోసారి మహేంద్రసింగ్ ధోని ఫోటో దిగారు.అయితే ఈ ఫోటో వెనకాల ఓ ఆసక్తికరచర్చ నడిచింది.

అదేమిటంటే… 20 సంవత్సరాల క్రితం బీహార్ – అస్సాంల మధ్య జరుగుతున్న మ్యాచ్ సమయంలో అస్సాం సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న నేపథ్యంలో భాగంగా అస్సాం రాష్ట్ర టీం తరఫున బ్యాట్స్మెన్ గా పరాగ్ దాస్ వచ్చారు.అయితే అదే మ్యాచ్ లో బీహార్ తరఫున జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ చేస్తున్నాడు.

ఇకపోతే ఆటలో భాగంగా బౌలర్ వేసిన బంతిని ఆడటానికి ముందుకు వెళ్లిన ఆ వ్యక్తి వికెట్ల వెనుక ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ బంతిని అందుకని రనౌట్ చేశాడు.

అయితే, అప్పుడు రనౌట్ అయిన పరాగ్ దాస్ కొడుకే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ లో బ్యాట్స్మెన్ గా రియాన్ పరాగ్.

దీన్ని బట్టి చూస్తే కాలం ఎంత స్పీడ్ గా వెళుతుందో ఇట్టే అర్థం అవుతుంది.రెండు రోజుల క్రితం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తల పడిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేస్తుండగా తన తండ్రికి వికెట్ కీపింగ్ చేసిన మహేంద్రసింగ్ ధోనినే అతనికి కూడా వికెట్ కీపింగ్ చేయడం నిజంగా విశేషమే.

అయితే ఈసారి మాత్రం రియాన్ పరాగ్ తన తండ్రి అవకాశం ఇచ్చిన విధంగా తాను ధోనికి అవకాశం ఇవ్వలేదు.ఇదే విషయాన్ని తాజాగా ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube