ధోనితో బ్రేకప్‌పై లక్ష్మీరాయ్‌ షాకింగ్‌ కామెంట్లు.. మచ్చగా మిగిలిపోయిందంటూ?

Ms Dhoni And Raai Laxmi Love Breakup Reasons Revealed

తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా స్పెషల్ సాంగ్స్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ గా లక్ష్మీరాయ్ కు పేరుంది.కర్ణాటకలోని బెల్గాంలో జన్మించిన లక్ష్మీ రాయ్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పదుల సంఖ్యలో సినిమాలలో నటించారు.అయితే మహేంద్ర సింగ్ ధోనీతో లక్ష్మీ రాయ్ తో ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

 Ms Dhoni And Raai Laxmi Love Breakup Reasons Revealed-TeluguStop.com

2008 సంవత్సరంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లక్ష్మీ రాయ్ ప్రచారకర్తగా ఉన్నారు.ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ధోని కెప్టెన్ కావడం గమనార్హం.ఆ సమయంలోనే ధోని, లక్ష్మీ రాయ్ మధ్య ప్రేమ పుట్టిందని వార్తలు వచ్చాయి.

అయితే 2009 సంవత్సరంలో ఈ ప్రేమ జంట విడిపోయారు.ఆ తర్వాత ధోని సాక్షిని వివాహం చేసుకున్నారు.

 Ms Dhoni And Raai Laxmi Love Breakup Reasons Revealed-ధోనితో బ్రేకప్‌పై లక్ష్మీరాయ్‌ షాకింగ్‌ కామెంట్లు.. మచ్చగా మిగిలిపోయిందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో బ్రేకప్ గురించి స్పందించి లక్ష్మీరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన లైఫ్ లో ధోనితో కొనసాగించిన రిలేషన్ మాయని మచ్చలా మిగిలిపోయిందని ఆమె అన్నారు.ధోనితో బ్రేకప్ జరిగి 12 సంవత్సరాలు అయిందని అయితే ఇప్పటికీ ఈ విషయం తనను వెంటాడుతోందని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చారు.మీడియాలో ధోని గురించి ఏదైనా ప్రస్తావన వస్తే తన పేరు కూడా చర్చకు వస్తోందని లక్ష్మీరాయ్ తెలిపారు.

తనకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టినా ధోనీని తనను ప్రస్తావిస్తూ ఉంటారేమోనని లక్ష్మీరాయ్ బాధ పడ్డారు.

Telugu Bollywood, Breakup, Cricketer, Laxmi Raay, Love, Love Breakup, Msdhoni, Tollywood-Movie

ధోని తాను బ్రేకప్ చెప్పుకున్నా ఒకరిపై మరొకరికి గౌరవం ఉందని ఆమె అన్నారు.ధోని తరువాత కూడా తన లైఫ్ లో చాలా బ్రేకప్స్ జరిగాయని లక్ష్మీరాయ్ తెలిపారు.అయితే ఆ బ్రేకప్స్ ను ఎవరూ గమనించలేదని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టానని పెళ్లిపై తనకు ఆలోచన లేదని లక్ష్మీరాయ్ అన్నారు.

#Love #Cricketer #Breakup #MSDhoni #Laxmi Raay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube