దుల్కర్ కోసం హిందీ జెర్సీ హీరోయిన్ ని తీసుకొస్తున్న దర్శకుడు

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడుగా మలయాళం చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన నటుడు దుల్కర్ సల్మాన్.అతి తక్కువ కాలంలోనే టాలెంటెడ్ యాక్టర్ గా తండ్రిని మించిన తనయుడుగా దుల్కర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Mrunal Thakur To Star Opposite Dulquer Salmaan-TeluguStop.com

రొటీన్ కి భిన్నంగా కథా బలం ఉన్న సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.ఈ కారణంగానే దుల్కర్ సల్మాన్ కేవలం ఒక్క మలయాళంకి మాత్రమే పరిమితం కాకుండా సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

మహానటి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు అదే ప్రొడక్షన్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సౌత్ బాషలన్నింటిలోకి తెరకెక్కుతుంది.

 Mrunal Thakur To Star Opposite Dulquer Salmaan-దుల్కర్ కోసం హిందీ జెర్సీ హీరోయిన్ ని తీసుకొస్తున్న దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్గిల్ వార్ నేపధ్యంలో నడిచే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.స్వప్న దత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఆర్మీ జవాన్ గా కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామని దర్శకుడు హను రాఘవపూడి ఫైనల్ చేశాడు.

హిందీ జెర్సీ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తున్న అందాల భామ మృణాల్ ఠాగూర్ ని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.పాన్ ఇండియా రేంజ్ సినిమా ద్వారా సౌత్ లో ఈ భామ అడుగుపెట్టడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి.

#Mrunal Thakur #Pan India Movie #Swapna Dutt #Dulquer Salmaan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు