హృదయం బద్ధలైందన్న యంగ్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

సినిమా రంగంలో ప్రస్తుతం హీరోయిన్ స్టేటస్ ను అందుకుని లక్షల్లో, కోట్లలో పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు కెరీర్ తొలినాళ్లలో ఏదో ఒక సందర్భంలో అవమానాలను ఎదుర్కొని ఉంటారు.ఆ అవమానాలను చెప్పుకోవడానికి కొంతమంది హీరోయిన్లు ఇష్టపడితే మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం అస్సలు ఇష్టపడరు.

 Mrunal Thakur Says She Hand Nervous Break Downs  Nervous Break Downs, Career Pro-TeluguStop.com

అయితే యంగ్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తనకు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను నటించిన ఫస్ట్ మూవీ లవ్ సోనియా అని ఆ మూవీలో తాను హీరోయిన్ గా ఎంపికయ్యానని తెలిసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని ఆమె అన్నారు.

అయితే ఆ సినిమాలోని సోనియా పాత్ర కోసం తనతో పాటు మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు నోటీస్ బోర్డులో ఉండటంతో తన హృదయం బద్ధలైందని మృణాళ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.ఒకవేళ తనకు ఛాన్స్ వస్తే ఆ పాత్రకు న్యాయం చేయాలని తాను అనుకున్నానని మృణాళ్ చెప్పుకొచ్చారు.

Telugu Career Problems, Love Sonia, Mrunal Thakur, Break Downs-Movie

చివరకు ఆ పాత్ర కోసం తానే ఎంపికయ్యానని మృణాళ్ తెలిపారు. 2018 సంవత్సరంలో లవ్ సోనియా మూవీ రిలీజైందని ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఆమె తెలిపారు.ఈ సినిమా సక్సెస్ కావడంతో మృణాళ్ ఠాకూర్ కు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.ప్రస్తుతం మృణాళ్ జెర్సీ హిందీ రీమేక్ లో నటిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

తెలుగులో శ్రద్దాశ్రీనాథ్ పోషించిన పాత్రను హిందీలో మృణాళ్ ఠాకూర్ పోషిస్తున్నారు.ఇతర ఇండస్ట్రీలలో కూడా మృణాళ్ ఠాకూర్ కు సినిమా ఆఫర్లు వస్తుండగా ఆచితూచి మృణాళ్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో మృణాళ్ ఠాకూర్ టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube