సినీ నటి మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఇటీవల ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు.ఇప్పటివరకు తెలుగు హిందీ మరాఠీ భాషలలో సినిమాలు చేసినటువంటి ఈమె తెలుగులో సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తన మనసుని హత్తుకున్న సినిమా అంటూ తెలియజేశారు.
నటీనటులు పాత్రల్లో లీనమైతేనే అవి ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి.మనం జీవించినట్లు ఉండాలి.సీతారామం సినిమా( Sitaramam )ను ప్రాణం పెట్టి చేశాను.
అందుకే దానినుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నానని ఈమె తెలియజేశారు.నేను చాల ఇష్టంగా ఈ సినిమా చేశాను కనుక ఇప్పటికీ నన్ను సీతా మహాలక్ష్మిగా గుర్తు పెట్టుకున్నారని తెలిపారు.
ఇక కెరీర్ తొలినాళ్ళలో చాలా మంది నాకు నటన రాదని, నన్ను హేళన చేశారు.అలా నన్ను అప్పుడూ తిరస్కరించిన వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
అప్పుడు నేను నటనకు పనికి రానని చెప్పారు కాబట్టే నాలో పట్టుదల పెరిగింది.ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాను.నటీనటుల మధ్య పోటీ అనేది తప్పకుండా ఉండాలి.ఒకరికి పోటీగా ఉండడంలో తప్పేం లేదంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఫ్యామిలీ స్టార్( Family Star ) ఫోటోలను అభిమానులతో పంచుకున్న ఈమె ఈ పాత్రకు నేను 100 శాతం న్యాయం చేశానని తెలిపారు.
ఇక కెరీర్ పరంగా నేను చేసే ప్రతి పాత్ర ఎప్పటీకి నాకు గుర్తు ఉండిపోతుందని ఈమె తెలిపారు.