టాలీవుడ్‌ లో ఈ సీత బిజీ అవ్వడం ఖాయం

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినా సీతారామం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.నేడు భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్న సీతారామం సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

 Mrunal Thakur Is Most Busy Heroine In Tollywood In Coming Days , Flim News, Mrunal Thakur, Sitaramam , Tollywood Movies-TeluguStop.com

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన ఈ సినిమా లో ఆయన కు జోడీ గా బాలీవుడ్‌ నటి మృణాల్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే.ఉత్తరాది బుల్లి తెర స్టార్ అయిన ఈ అమ్మడు త్వరలో టాలీవుడ్ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారడం ఖాయం అంటూ విశ్లేషకులు అంటున్నారు.

సీతారామం సినిమా విడుదల తర్వాత ఈమె అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల కూడా వరుసగా సినిమాలు చేసే అవకాశాలు చాలా స్పష్టం గా కనిపిస్తున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొదటి సినిమా తోనే ఇక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ముందు ముందు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.

 Mrunal Thakur Is Most Busy Heroine In Tollywood In Coming Days , Flim News, Mrunal Thakur, Sitaramam , Tollywood Movies-టాలీవుడ్‌ లో ఈ సీత బిజీ అవ్వడం ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీతారామం సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు రెండు మూడు సినిమాలకు సైన్ చేసినట్లుగా తెలుస్తోంది.తాజాగా సీతారామం సినిమా విడుదల అయ్యి ఈమె పాత్రకు పాజిటివ్‌ రెస్పాన్స్ రావడం తో పాటు నటన కు మంచి మార్కులు పడ్డాయి.

కనుక ఈ అమ్మడికి త్వరలోనే అయిదు నుండి పది సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా లో నటన కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి, కనుక ముందు ముందు ఈమె టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరింత బిజీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సినీ వర్గాల వారితో పాటు మీడియా వర్గాల వారు మరియు సినీ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మృణాల్ ఠాకూర్ గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియా లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube