మృనాల్‌ ఠాకూర్ తెలుగులో అరడజను సినిమాలు...

దుల్కర్‌ సల్మాన్ హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్గా తెరకెక్కిన సీతారామం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమాలో సీత పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

 Mrunal Thakur Back To Back Movies In Tollywood , Mrunal Thakur, Tollywood , Dulquer Salmaan, Sitaramam-TeluguStop.com

ఆ పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.ఆమె వరుసగా సినిమాలో ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అభిప్రాయం ఉంది.

సినిమా విడుదలైన తర్వాత నిజంగానే ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.ఇప్పటికే ఆమె మూడు నాలుగు సినిమాలకు సైన్‌ చేసిందని ప్రచారం కూడా మొదలైంది.

 Mrunal Thakur Back To Back Movies In Tollywood , Mrunal Thakur, Tollywood , Dulquer Salmaan, Sitaramam-మృనాల్‌ ఠాకూర్ తెలుగులో అరడజను సినిమాలు#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆమె సినిమా లు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి సీతారామం సినిమా వల్ల ఏకంగా అరడజను సినిమా లు ఆమె ఖాతాలో పడ్డట్లు అయింది.

మొన్నటి వరకు మృనాల్ ఠాకూర్ అంటే ఎవరికి పెద్దగా తెలియదు.కానీ ఇప్పుడు ఆమె ఒక పెద్ద స్టార్, ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మృణాల్‌ ఠాకూర్ యొక్క అందం మరియు ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఆమె అతి త్వరలోనే టాప్ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల్లో ఆమె ప్రస్తుతానికి పాతిక నుండి 30 లక్షల పారితోషికంను తీసుకుంది.కానీ ఆమె ముందు ముందు అతి భారీ పారితోషకం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు ప్రస్తుతం ఆమె డేట్ల కోసం ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.ఒక స్టార్ హీరో కొత్త సినిమాకు గాను ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట.

అందు కోసం ఆమెకు ఏకంగా కోటి రూపాయలు కూడా యూనిట్ సభ్యులు ఆఫర్ చేశారని తెలుస్తోంది.ఇక నుండి వరుసగా సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube