కర్నెతండాలో నూతనంగా నిర్మించిన తుల్జాభవానీ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీమతి సత్యవతి రాథోడ్..

వనపర్తి జిల్లా, ఖిల్లా ఘణపురం మండలం, కర్నెతండాలో నూతనంగా నిర్మించిన తుల్జాభవానీ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణిదేవి గారు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృష్ణానాయక్ , జడ్పీటీసీ సామ్యానాయక్, సర్పంచ్ శాంతాభాయి గార్లు దేవాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ తల్లి స్వర్గీయ సింగిరెడ్డి తారకమ్మ పేరు మీద అన్నదానం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు.

 Mrs. Satyavathi Rathod Attending The Inauguration Of The Newly Constructed Tulja-TeluguStop.com

ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారి వ్యాఖ్యలు.

అందరికీ అమ్మ వారి ఆశీస్సులుండాలి.కర్నెతండా తుల్జాభవానీ ఆలయం తెలంగాణ తుల్జాభవానీ ఆలయంగా విలసిల్లాలి.

ఆలయం మొదలుపెట్టినప్పుడు నా సహకారం ఉంటుందని చెప్పాను.ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడం సంతోషంగా ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు తుల్జాభవానీ మాత ఆశీస్సులుండాలి.డబల్ బెడ్రూం ఇండ్లు కట్టించా.రూ.72 కోట్లతో కర్నెతండా లిఫ్టు సాధించాను.

ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువస్తాను కర్నెతండా లిఫ్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో శంకుస్థాపన చేయిస్తాను.మండలంలోని 24 తండాలకు 20 తండాలకు రహదారులు వేయించడం పూర్తయింది .మిగిలిన వాటికి త్వరలోనే రోడ్లు వేయించడం జరుగుతుంది.కర్నెతండా లిఫ్టుతో సాగునీటి సమస్య తీరిపోతుంది.

ముంబయి వలసవెళ్లిన కూలీలతో సమావేశం అయినప్పుడు సాగునీరు వస్తేనే సమస్య తీరుతుందని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.దేవాలయం నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు.

Telugu Karna Thanda, Karnathanda, Niranjan Reddy, Surabhi Vani, Telngana-Latest

గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు.మన ఇష్ట దైవం తుల్జాభవాని మాత ఆలయం నిర్మించుకోవడం గొప్ప విషయం.అమ్మ వారి అనుగ్రహం అందరికీ లభించాలి.ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత అప్తులు మంత్రి నిరంజన్ రెడ్డి గారు.వారి సహకారంతో వనపర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలి.గిరిజనులు ఎంత కష్టపడినా, ఎన్ని కష్టాలున్నా సంపాదించిన సంపాదనలో తుల్జాభవానీ మాత కోసం దాచుకుంటారు.పేద గిరిజన ఆడబిడ్డను అయిన నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు.70 ఏళ్లుగా గిరిజనులను వేరే పార్టీలు ఓటు వేసే యంత్రాలుగా వాడుకున్నారు.తండాలను గ్రామ పంచాయతీలు చేసి మన తండాలను మనం పాలించుకునే అవకాశం సిఎం కేసిఆర్ గారు కల్పించారు.నాలుగు వేల తండాలను పంచాయతీలుగా మార్చారు.టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే తండాలలో రోడ్లు, తాగునీరు వంటి మౌళిక సదుపాయాలు కల్పించారు.రైతుబంధు, రైతుభీమా పథకాలతో రైతాంగానికి చేయూతనిచ్చారు.

కళ్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షా 116 లు అందిస్తూ పేదింటి ఆడబిడ్డల పథకంతో అండగా నిలుస్తున్నారు.పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.గిరిజనులు బతుకుదెరువుకు ముంబయి వలసపోయేది.సాగునీటి రాకతో గిరిజనుల జీవితాలలో మార్పు వచ్చింది.ఘణపురం అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను.

ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారి వ్యాఖ్యలు.తుల్జాభవానీ ఆలయం నిర్మించుకోవడం సంతోషకరం.అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలి.బడి వందేళ్లు.

గుడి వెయ్యేళ్లు.గిరిజన సాంప్రదాయాలను కాపాడుకోవాలి.

సంస్కృతి అనేది గొప్ప వారసత్వ సంపద.ఈ కార్యక్రమానికి ముందు ఖిల్లాఘణపురంలో బ్రిడ్జి నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.

కర్నెతండాలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం ప్రారంభం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube