సూపర్ : రైతుని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన ఎమ్మార్వో...- Mro Is Apply For Marry To Farmers In Marriage Beuro In Telangana

MRO is apply for marry to farmers in marriage beuro in Telangana, marriage beuro, MRO news, Telangana, Karim Nagar, MRO is apply for marry to farmers, MRO is get Ready to marry to farmers - Telugu Karim Nagar, Marriage Beuro, Mro Is Apply For Marry To Farmers, Mro Is Apply For Marry To Farmers In Marriage Beuro In Telangana, Mro Is Get Ready To Marry To Farmers, Mro News, Telangana

మామూలుగా దేశానికి “వెన్నెముక రైతు” అని ఎంతోమంది కవులు మరియు మేధావులు వర్ణించారు.కానీ కాలం మారుతున్న కొద్దీ రైతుని పెళ్లి చేసుకోవడానికి మాత్రం యువతులు అస్సలు ఆసక్తి కనబరచడం లేదు.

 Mro Is Apply For Marry To Farmers In Marriage Beuro In Telangana-TeluguStop.com

దీంతో వ్యవసాయం చేసేటువంటి యువ రైతులు దాదాపుగా 30 ఏళ్ళు నిండిన చాలా మంది బ్రహ్మచారులుగానే ఉంటున్నారు.దీంతో ఓ యువకుడు వ్యవసాయం చేసే యువకులకు పెళ్లిళ్లు చేయడమే కంకణం కట్టుకొని ఏకంగా ఓ మ్యారేజ్ బ్యూరో ని కూడా తెరిచాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ జిల్లాలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇతడు ఉన్నత చదువులు చదివినప్పటికీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో సొంత ఊర్లోనే వ్యవసాయం చేస్తూ సెటిలయ్యాడు.

 Mro Is Apply For Marry To Farmers In Marriage Beuro In Telangana-సూపర్ : రైతుని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన ఎమ్మార్వో…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్లకి మంచి డిమాండ్ పెరిగింది. కానీ అన్నం పండించే రైతులను మాత్రం పెళ్లిళ్లు చేసుకోవడానికి యువతులు ముందుకు రావడం లేదు.

దీంతో అంజిరెడ్డి రైతు మ్యారేజ్ బ్యూరో ని తెరిచి వ్యవసాయం చేసే యువ  రైతులకు పెళ్లిళ్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇందులో భాగంగా రైతులను పెళ్లి చేసుకుంటే వచ్చే లాభాలను యువతి తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఇప్పటికే పలు పెళ్లిళ్లు కూడా చేశాడు.

కాగా తాజాగా మండల రెవెన్యూ ఆఫీసర్ గా పని చేస్తున్న ఓ మహిళ ఎమ్మార్వో రైతుని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చిందని అంజి రెడ్డి తెలిపాడు.అంతేగాక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టణాల్లో కంటే పల్లెల్లోనే జీవితం చాలా సౌకర్యంగా ఉంటుందని అలాగే వసతులు కూడా బాగా మెరుగు పడ్డాయని తెలిపాడు.

దీంతో ఈ విషయం తెలిసిన కొందరు యువ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఉద్యోగం అనేది కేవలం బ్రతకడానికి మాత్రమేనని కానీ వ్యవసాయం మాత్రం పది మందిని బ్రతికిస్తుందని అలాగే వ్యవసాయంలోనే సాయం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

#Karim Nagar #MROIs #MROIs #MROIs #Marriage Beuro

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు