మృగశిర కార్తె రోజు చేపలు తినడానికి కారణం ఏమిటో తెలుసా?

Why People Eat Fish In Mrugashira Karthe, Eating Fish, Fish Curry, Fish Prices, Mrigasira, Mrigasira Karthi, Remove Health Problems, Rains, High Temperatures, Immunity Power, Hindu Tradition, Hyderabad, Asthma Patients,

మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి కార్తెలు మారుతూ ఉంటాయి.ఈ విధంగా జూన్ 8వ తేదీ మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.

 Why People Eat Fish In Mrugashira Karthe, Eating Fish, Fish Curry, Fish Prices,-TeluguStop.com

ఈ కార్తె రోజు ప్రతి ఒక్కరు తమ ఇళ్ళల్లో చేపలు వండుకొని తింటారు.ఈ విధంగా మృగశిర కార్తె రోజు చేపలు వండుకొని తినడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.

అసలు మృగశిర కార్తెకు చేపలకు ఉన్న అనుబంధం ఏమిటి? మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

జూన్ 8వ తేదీ అనగా నేడు ప్రారంభమైన ఈ కార్తె పదిహేను రోజుల పాటు ఉంటుంది.సూర్యుడు ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది.

ఈ క్రమంలోనే ఒక్కొక్క కార్తెలో ఒక్కో విధమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి.ఇప్పటివరకు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఈ కార్తె మొదలవగానే క్రమంగా చల్ల బడుతుంటాయి.

అదే విధంగా వర్షాలు కూడా అధికంగా రావడంతో ఎన్నో రకాల సూక్ష్మజీవులు పునరుత్పత్తి జరిగే ప్రజలలో అనేక వ్యాధులు రావడానికి కారణమవుతాయి.

ప్రజలలో రోగనిరోధకశక్తి మెరుగుపడటానికి అదేవిధంగా ఉన్నఫలంగా శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా మన శరీరానికి వేడిని కలుగ చేయడానికి మృగశిర కార్తె రోజు చేపలను తింటారు.

ఈ కార్తె ప్రారంభమైన రోజు మనకు ఎక్కడ చూసినా చేపల కూర, చేపల ఫ్రై వండుకొని తింటారు.ఈ విధంగా చేపలు తినడం వల్ల గుండెజబ్బులు ఆస్తమా వంటి వ్యాధులు నయమవుతాయి.

ఈ మృగశిర కార్తె ప్రారంభమైన రోజు ఆస్తమా వంటి జబ్బులతో బాధపడే వరకు చేపపిల్లలను ఇస్తారు.ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ చేప మందును పెద్దఎత్తున ఆస్తమా బాధితులకు అందిస్తారు.ఈ క్రమంలోనే రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు చేప మందు కోసం పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.మాంసాహారులైతే కార్తె రోజు చేపలను ఇంగువలో లేదా చింతచిగురులో పెట్టుకొని తినేవారు.

అదేవిధంగా శాకాహారులైతే కార్తె ప్రారంభమైన రోజు ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు చేసుకుని తినే వారు.అందుకే మృగశిర కార్తె రోజు ఇంట్లో చూసినా చేపల పులుసు ఉంటుంది.

Why People Eat Fish In Mrugashira Karthe, Eating Fish, Fish Curry, Fish Prices, Mrigasira, Mrigasira Karthi, Remove Health Problems, Rains, High Temperatures, Immunity Power, Hindu Tradition, Hyderabad, Asthma Patients, - Telugu Asthma, Fish, Fish Curry, Hindu, Hyderabad, Immunity, Mrigasira, Remove Problems

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube