Sri Satya Jabardast : జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీ సత్య... అతనితో విభేదాలే కారణమా?

Mr. Satya Who Re-entered Jabardast... Is It Because Of Differences With Him ,sri Satya ,Jabardast,Chammak Chandra ,Sri Satya Chammak Chandra

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో చమ్మక్ చంద్ర ఒకరు.ఈయన ఎక్కువగా మొగుడు పెళ్ళాల స్కిట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

 Mr. Satya Who Re-entered Jabardast... Is It Because Of Differences With Him ,sr-TeluguStop.com

ఇక చమ్మక్ చంద్ర టీంలో కూడా ఎంతోమంది కమెడియన్లు మంచి పేరు పొందారు.ఇలా చమ్మక్ చంద్రకు భార్యగా నటిస్తున్నటువంటి వారిలో కమెడియన్ శ్రీ సత్య ఒకరు.

శ్రీ సత్య చమ్మక్ చంద్ర భార్యగా ఎంతో అద్భుతంగా తన కామెడీ డైలాగుల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

ఇకపోతే ఒకానొక సమయంలో జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఎంతోమంది కమెడియన్స్ బయటకు వెళ్లిపోయారు అలాంటి వారిలో చమ్మక్ చంద్ర టీం కూడా ఒకటి.

చమ్మక్ చంద్ర వెళ్ళిపోవడంతో తనతో పాటు తన టీమ్ మెంబర్స్ కూడా వెళ్లిపోయారు అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీ సత్య తనకు ఎంతో మంచి లైఫ్ ఇచ్చినటువంటి గురువుగారు చమ్మక్ చంద్ర ఆ కార్యక్రమంలో నుంచి వెళ్లిపోవడంతో తాము కూడా బయటకు వెళ్లామని చెప్పుకొచ్చారు.అవకాశం ఉంటే తిరిగి తాను జబర్దస్త్ కార్యక్రమంలోకి తిరిగి ఎంట్రీ ఇస్తానని గత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Telugu Chammak Chandra, Jabardast, Sri Satya, Srisatya-Movie

అయితే గతంలో చెప్పిన విధంగానే శ్రీ సత్య ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చి మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది.అయితే ఇలా తన గురువు వెళ్ళిపోవడంతో వెళ్లిపోయానని చెప్పిన శ్రీ సత్య తిరిగి ఈ కార్యక్రమంలోకి రావడంతో బహుశా ఈమెకు చమ్మక్ చంద్రతో ఏదైనా విభేదాలు తలెత్తయా అందుకే ఈమె తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఏది ఏమైనా శ్రీ సత్య వంటి కమెడియన్ రీ ఎంట్రీ ఇచ్చి తాగుబోతు రమేష్ టీం లో సందడి చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube