సరికొత్త స్టైల్ తో ఫుట్ బాల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మిస్టర్ కూల్..!

ఇండియా క్రికెట్ చరిత్రలో మిస్టర్ కూల్ గా ధోనీకి ఎంతో పేరుంది.అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత దోనీ ఫ్యామిలీతో బిజీ అయిపోయాడు.

 Mr Cool Made His Entry Into Football With The Latest Style-TeluguStop.com

అయినప్పటికీ తన ఫ్యాన్స్ ను ఐపీఎల్ లో ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు.కాస్త ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన తర్వాత ధోని మళ్లీ ఆటల్లోకి దిగిపోయాడు.

అయితే ఈసారి అందరూ అనుకున్నట్లుగా క్రికెట్ ఆట కాదు.ఫుట్ బాల్ ఆటలో బిజీ అయిపోయాడు.

 Mr Cool Made His Entry Into Football With The Latest Style-సరికొత్త స్టైల్ తో ఫుట్ బాల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మిస్టర్ కూల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ తారలతో అతడు ఆడి ఓడించడంతో వార్తల్లో కెక్కాడు.తాజాగా ధోనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ధోని ఆదివారం ముంబైలోని బాలీవుడ్ తారలతో కలిసి ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ను ధోని ఆడాడు.ఓ ఛారిటీ కోసం ధోనీ సెలబ్రిటీలతో మ్యాచ్ ఆడాడు.

ఈ మ్యాచులో ధోని తన కొత్త హెయిర్ స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు.ఆల్ స్టార్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం బాద్రాలోని ఫుట్‌ బాల్ గ్రౌండ్‌ కు ధోని చేరుకోగానే అందరూ ధోనీతో సెల్పీ తీసుకోవడాని పోటీ పడ్డారు.

జనం ఎగబడటంతో ఆ ప్రాంతం అంతా హోరెత్తింది.ధోని తన కొత్త హెయిర్ స్టైల్‌ తో మ్యాచు ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో వీడియోను షేర్ చేయడంతో అందరూ దానికి లైకుల వర్షం కురిపిస్తున్నారు.ఛారిటీ మ్యాచ్ అయినా కూడా ధోని తన ఫుట్‌ బాల్ మెళకువలను ఫుట్ బాల్ ఆటలో చూపించడం అందర్నీ ఆకట్టుకుంది.

ఈ వీడియోలో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కూడా పాల్గొని మ్యాచ్ ఆడాడు.సరదాగా సాగిన ఈ మ్యాచులో ధోని చాలా ఉత్సాహంతో ఆడాడు.అంతకు ముందుగా జరిగిన మ్యాచులో రణ్‌వీర్ సింగ్ తో కలిసి దిగిన ఓ ఫొటో వైరల్ అయ్యింది.

అలాగే ముంబై‌కి చెందిన ఆల్‌ స్టార్ ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహించిన ట్రైనింగ్‌ సేషన్‌ లో ధోనితో పాటుగా ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ కూడా ఆడి అందర్నీ ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం ధోని ఇలా ఫుట్ బాల్ ఆడిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వీక్షించండి.

#DhoniNew #Social Media #Viral Video #Foot Ball

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు