'మిస్టర్ బీన్' చనిపోయాడంటూ నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్!

Mr Bean Death Rumours Surface As Hoax Goes Viral Again

మిస్టర్ బీన్ పాత్ర అంటే చిన్న పిల్లలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చిన్న పిల్లలకు మాత్రమే కాదు పెద్ద వాళ్ళు కూడా మిస్టర్ బీన్ ప్రోగ్రాం ను ఆసక్తిగా చూస్తూ ఉంటారు.

 Mr Bean Death Rumours Surface As Hoax Goes Viral Again-TeluguStop.com

ఇక ఈ పాత్ర ద్వారా ప్రపంచానికి బాగా దగ్గరయ్యాడు హాలీవుడ్ నటుడు రోవాన్ అట్కిన్సన్. మిస్టర్ బీన్ గా అందరికి పరిచయం అయినా ఈయన గురించిన వార్త విని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆయన చనిపోయాడంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ వార్తను ఇంటర్నేషనల్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేయడం ఇప్పుడు అందరిని షాకింగ్ కి గురి చేస్తుంది.

 Mr Bean Death Rumours Surface As Hoax Goes Viral Again-మిస్టర్ బీన్’ చనిపోయాడంటూ నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వార్త విన్న కొంతమంది అభిమానులు RIP మిస్టర్ బీన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ ట్యాగ్ హల్ చల్ చేస్తుంది.ఇక మరికొంత మంది ఈ వార్త విని విచారణ వ్యక్తం చేస్తూ ఆయన లేరని కలత చెందుతున్నారు.

అయితే ఈ వార్త పూర్తిగా అబద్దం అని తెలిసింది.ఆయన మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను యూఎస్ బ్రాడ్ కాస్టర్ ఫాక్స్ న్యూస్ షేర్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది.

Telugu Hollywood, Bean, Beanaka, Rowan Atkinson-Movie

ఆయన కారు ప్రమాదంలో చనిపోయారని.బ్రేకింగ్ న్యూస్ అంటూ ఆ న్యూస్ ఛానెల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసారు.కానీ ఇది ఫేక్ న్యూస్ అని తెలియడంతో ఆయన అభిమానులంతా ఆ న్యూస్ ఛానెల్ పై మంది పడుతూ ఉన్నారు.

Telugu Hollywood, Bean, Beanaka, Rowan Atkinson-Movie

ఒక బాధ్యత గల స్థానంలో ఉండి ఇలాంటి ఫేక్ వార్తలను ఎలా స్ప్రెడ్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో ఆ ఛానెల్ పై ఫైర్ అవుతున్నారు.ఆయన చనిపోయారు అనే వార్త రావడం ఇదే మొదటిసారి కాదు.ఇప్పటికే ఒకసారి ఆయన చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి.1990 లో మొదటిసారి మిస్టర్ బీన్ పాత్రలో కనిపించిన రోవిన్ ను ఆ తర్వాత నుండి అందరు మిస్టర్ బీన్ అనే పిలుస్తున్నారు.ఇక ఈయన ప్రెసెంట్ ‘పికీ బ్లైండర్స్’ లో హిట్లర్ పాత్రను పోషించ బోతున్నాడు.

#Hollywood #BeanAka #Rowan Atkinson #Rowan Atkinson #Bean

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube