స్టూడెంట్ల‌కు పాఠాలు చెప్ప‌నున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్క‌డో కాదండోయ్‌..

మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు స్కూళ్ల‌లో అయినా లేదంటే డిగ్రీ స్థాయిలో అయినా స‌రే స్టూడెంట్ల‌కు పాఠాలు టీచ‌ర్లే చెబుతుంటారు.కొన్ని ప్ర‌త్యేక స‌మ‌యంలో మాత్ర‌మే కొంద‌రిని పిలిపించి వారితో క్లాసులు చెబుతుంటారు.

 Mps, Mlas Who Are Going To Teach Lessons To Students .. Not Somewhere .., Mps An-TeluguStop.com

కాగా ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్టూడెంట్ల‌కు క్లాసులు చెప్ప‌బోతున్నారు.ఎక్క‌డో కాదండోయ్ మ‌న తెలంగాణ రాష్ట్రంలోనే.

ఇప్పుడు తెలంగాణ‌లో 2021–22 సంవ‌త్స‌రానికి సంబంధించి B.A డిగ్రీ గ్రూపులో నూత‌నంగా ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ను ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి అంద‌రికీ విదిత‌మే.

అయ‌తే ఈ క్లాసుల విష‌యంలో ఉన్న‌త విద్యామండలి ఓ నిర్ణ‌యం తీసుకుంది.

అదేంటంటే ఈ క్లాసుల‌ను ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న‌టువంటి సీనియర్ ఎంపీలు ఎమ్మెల్యేల‌తో చెప్పించాల‌ని నిర్ణయించింది.

అలాగే అయితే వీరితో పాటు ఆర్బీఐ ఉన్నతాధికారుల‌ను కూడా రంగంలోకి దింపాల‌ని, వార‌యితేనే స్టూడెంట్ల‌కు అర్థ‌వంతంగా క్లాసులు చెప్తార‌నే న‌మ్మ‌కంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఇక వారి టైమింగ్స్ కు త‌గ్గ‌ట్టు సిలబస్ కరికులమ్ ల‌ను కూడా సిద్ధం చేస్తోంది.

Telugu Mps, Ba Classes, Koti Womens, Mlas, Nizam Collegs, Senior Mlas, Telengana

అయితే ఈ బీఏ ఆన్స‌ర్ కోర్సుల‌ను 4 కాలేజీల్లో అంటే నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీ అలాగే సిటీ కాలేజీతో పాటుంగా బేగంపేటలోని ప్ర‌ముఖంగా ఉండే ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో బీఏ వీటిని పెట్టి వారంద‌రితో క్లాసులు చెప్పించేందుకు ఉన్న‌త విద్యా మండ‌లి సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.ముఖ్యంగా ఎమ్మెల్యేలతో ఎకనామిక్స్ క్లాసులు చెప్పిస్తే చాలా సింపుల్ గా ఆ పాఠాలు అర్థం అవుతాయ‌ని అనుకుంఉట‌న్నారు.ఇక ఆర్బీఐ అధికారుల‌తో కూడా బాగానే చెప్పించాల‌ని ప్లాన్ చేస్తోంది.వారితో అయితే స్టూడెంట్ల‌కు ఈజీగానే అర్థం అవుతుందని భావిస్తోంది.మ‌రి ఈ ప్లాన్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారంట తెలంగాణ ఉన్న‌త విద్యామండి అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube