వినాయక నిమజ్జనం లో నాగిని డ్యాన్స్ తో రెచ్చిపోయాడు,చివరికి!  

Mp Man Dies While Doing Nagini Dance During Ganapati Visarjan-mp Man,senoyi Village

వినాయక చవితి నిమజ్జన వేడుకలు దాదాపు అన్నీ చోట్ల ముగిసినట్లే అని చెప్పాలి.అధికారులు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటుంది.

MP Man Dies While Doing Nagini Dance During Ganapati Visarjan-Mp Senoyi Village

ఈ ఏడాది కూడా పలువురు నిమజ్జనం సమయంలో తమ ప్రాణాలు కోల్పోయారు.అయితే మధ్యప్రదేశ్ లో కూడా ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

అయితే అతడు నాగిని డాన్స్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచివేసింది.మధ్యప్రదేశ్ లోని సెనోయి జిల్లా లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబందించిన వీడియో తాజాగా విడుదల అవ్వడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

MP Man Dies While Doing Nagini Dance During Ganapati Visarjan-Mp Senoyi Village

వివరాల్లోకి వెళితే… వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో గురుచరణ్ ఠాకూర్ అనే వ్యక్తి పాల్గొని నృత్యాలు చేశాడు.అందులో భాగంగా ఠాకూర్ నాగిని డ్యాన్స్ కూడా చేస్తూ వివిధ ఆకారాల్లో శరీరాన్ని తిప్పడం ప్రారంభించాడు.

అయితే అంతటితో ఆగకుండా వినూత్న రీతిలో చేయాలనీ వివిధ భంగిమలు చేయడం మొదలు పెట్టాడు.దీనిలో భాగంగా తలకిందులుగా గెంతులు వేయడానికి ప్రయత్నించడంతో తల నేలకు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

కదలికలు లేకపోవడం చూసి ఏమైందోనని అక్కడే ఉన్న స్థానికులు చూసేలోపే మృత్యుఒడిలోకి జారుకున్నాడు.అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం తో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు

Mp Man Dies While Doing Nagini Dance During Ganapati Visarjan-mp Man,senoyi Village Related....