ఎంపీ వద్దు ఎమ్యెల్యే అయితే ఒకే ! ఇప్పుడు ఇదే స్పెషల్ స్టేటస్

ఏపీ ప్రత్యేక హోదా అంశం రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.చిత్తశుద్దిగా హోదా కోసం పోరాడడం మాట ఎలా ఉన్నా హడావుడి మాత్రం బాగా చేసేసారు.

 Mp Vaddu Mla Mudhu Ippudu The Special Status-TeluguStop.com

హోదా కోసం పోరాడింది మేము అంటే మేము అని పోటీలుపడి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు.ప్రజల్లో హోదా సెంటిమెంట్ బలంగా ఉండడంతో రాబోయే ఎన్నికల్లో ఇదే అస్త్రంగా చేసుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రతిపార్టీ పావులు కదుపుతున్నాయి.

అసలు ఏపీకి హోదా అవసరమా అంటే అవసరమే .ఎందుకంటే … ఏపీ అభివృద్ధి చెందాలన్నా,నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు రావాలన్నా,రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల‌న్నా, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాల‌న్నా,ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెర‌గాల‌న్నా,ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌న్నా,రైతుల‌కు మేలు చేకూరాల‌న్నా వీటన్నింటికి స్పెషల్ స్టేటస్ వచ్చి తీరాల్సిందే.అందుకే రాజకీయ పార్టీలు కూడా వీటిపై అంతగా దృష్టిపెట్టాయి.

ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలంటే కేంద్రంతో అంటకాగాలని ముందుగానే భావించిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీతో గత ఎన్నికల ముందు జతకట్టాడు.

ఇంకేముంది మోదీ ఏపీకి వారలు ఇచ్చేయబోతున్నాడు.ప్ర‌పంచ న‌గ‌రాలు సిగ్గుప‌డేలా అమ‌రావ‌తి రాజధానిని నిర్మిస్తామ‌ని,స్పెష‌ల్ స్టేట‌స్ ఐదేళ్లేం క‌ర్మ‌,ప‌దేళ్లు ఇస్తాడ‌ని, ఇలా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య చంద్రబాబు ఉండిపోయాడు.

అయితే మోదీ మాత్రం మొండి చేయి చూపించాడు.

విభ‌జ‌న చ‌ట్టంలోని ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌లేదు.

కానీ ఏపీకి స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే ప్రయోజనాలకంటే ఇంకా ఎక్కువే చేశామని బీజేపీ నేతలు చెప్తున్నారు.కానీ అందుకు సంబంధించిన లెక్క‌లు ఏపీ స‌ర్కార్ చూపెట్ట‌క‌పోవ‌డంతో జ‌నాలు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు.

ఇప్ప‌టికే ఆయా గ్రామాల్లో నాయ‌కుల నిల‌దీత కార్య‌క్ర‌మం మొద‌లైంది.ఎన్నిక‌ల నాటికి ఈ నిల‌దీత కార్య‌క్ర‌మం ఊపందుకోవ‌డ‌మే త‌రువాయి.

ఇక ఏపీని విభ‌జించి 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గ‌ల్లంతైంది.ప్ర‌త్యేక‌హోదా కార‌ణంగా రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ,బీజేపీల పరిస్థితి కూడా ఇలాగె ఉండబోతుందని చర్చలు మొదలయ్యాయి.

హోదా ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో అన్నిపార్టీల‌తో పోల్చితే వైసీపీనే కొంచెం ముందడుగు వేసింది.కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అవిశ్వాసం పెట్ట‌డంతోపాటు, త‌మ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించి జగన్ తన చిత్తశుద్ధి నిలబెట్టుకున్నాడు.

దీంతో వైసీపీలో కొంచెం ధీమా పెరిగింది.ఈ దశలోనే అధికార పార్టీ టీడీపీలో కలవరం మొదలయ్యింది.

రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీపై పోటీ చేసేందుకు టీడీపీ నేత‌లు ముందుకు రాక‌పోవ‌డం సీఎం చంద్ర‌బాబుకు క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంది.ముఖ్యంగా నెల్లూరు లోక్ స‌భ‌ విష‌యానికొస్తే టీడీపీకి అభ్య‌ర్థులు దొర‌క‌డం లేద‌ట‌.

ఇక్క‌డినుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డినే మ‌రోసారి బ‌రిలో దింపాల‌ని చంద్ర‌బాబు భావిస్తుంటే.నాకు ఎంపీ వద్దు ఎమ్యెల్యే అయితే ఒకే అని ఆయన చెప్పేస్తున్నాడట.

ఒక్క ఆదాల ప్ర‌భాకర్ రెడ్డి మాత్ర‌మే కాదు, దాదాపుగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన ప్ర‌తీచోట టీడీపీకి ఇదే ప‌రిస్థితి ఉన్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.ఇక మ‌రికొన్ని చోట్ల మాత్రం ఆర్థికంగా పార్టీ ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇస్తే, తాము సాహ‌సం చేస్తామ‌ని,లేక‌పోతే పోటీకి దిగ‌మ‌ని చెప్పేస్తున్నారట.

దీంతో, లోక్ స‌భ అభ్య‌ర్థుల కోసం టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది.ఎంపీగా పోటీ చేసేకంటే ఎమ్యెల్యేగా పోటీ చేస్తే మినిమం గ్యారంటీ ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.

ప్రస్తుత టీడీపీ ఎంపీలు కుడా ఇదే ఆలోచనలో ఉండడం చూస్తుంటే ఎంపీగా పోటీ చేయడానికి ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube