వైరల్ ఫోటో.. విత్తన గణపతి ఫోటోలు చూశారా ?

ఈ నెల 22న వినాయక చతుర్థి… సాధారణంగా అయితే వినాయక చవితికి 15 రోజుల ముందు నుండి అందరూ వినాయకుడి చందాలు అని, డెకరేషన్ అని ఇలా అన్ని ముందుగా చూసుకునే వారు.కానీ కరోనా వైరస్ కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది.

 Mp Santosh Distributing Seeds Ganesh,seed Ganesh, Eco Friendly, Ganesh Chaturthi-TeluguStop.com

ఎన్నో చోట్ల ఉత్సవాలను ఆపేశారు.అయితే ఈ కరోనా సమయంలో వినాయక చవితి ఉత్సవాల గురించి ఆలోచించకుండా మన ఇంట్లోనే ఎంతో ఆనందంగా పూజించేందుకు అద్భుతమైన గణేశుడు వచ్చేసాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ప్రకృతినీ కాపాడేందుకు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఓ విన్నూత కార్యక్రమాన్ని చేపట్టారు.అదే హరితహారంలో భాగం అయినా విత్తనాల గణేశుడు.ఈ వినాయక చవితికి విత్తన గణపతి విగ్రహాలను ప్రజలకు పంచాలని అయన నిర్ణయం తీసుకున్నారు.

దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి చేతుల మీదుగా అయన విత్తన గణపతిని ఆవిష్కరించారు.

స్వచ్ఛమైన మట్టి గణపతితో పాటు వేప విత్తనాలను ప్రజలకు పంపిణి చేయడాన్ని విత్తనాల గణేష్ అని అంటారు.

గణేశునితో పాటు ఇచ్చే కొబ్బరిపీచు తొట్టిలోని ఆ విత్తనాలు 7 రోజుల్లో మొలకెత్తుతాయి.ఇంకా విగ్రహాల పంపిణీని గో రూరల్‌ ఇండియా సంస్దతో కలిసి మొదలు పెట్టనున్నట్టు ఎంపీ సంతోష్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube