ఆర్. నారాయణమూర్తి సినిమా పై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందన ఏంటంటే.. ?  

mp Revanth Reddy, R Narayana Murthy, Rythanna, new movie-tollywood-new farmmer acts-delhi-revanth reddy-congrees mp-febraury-social revulutios - Telugu Mp Revanth Reddy, New Movie, R Narayana Murthy, Rythanna

ఆర్.నారాయణమూర్తి సినిమాలు అనగా పేద ప్రజల కష్టాలు, రైతన్నల గోసలు, కూలీల తిప్పలు ఇలా సామాన్య మానవుడి నుండి నిరుపేద వాడి వరకు అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటాయన్న విషయం తెలిసిందే.

TeluguStop.com - Mp Revanth Reddy Response On Narayana Murthy Movie

ముఖ్యంగా సామాజిక అంశాలనే తన కధకు బలంగా నమ్మి ఇలా ఎన్నో చిత్రాలను నిర్మించిన టాలీవుడ్ దర్శకనటుడు ఆర్.నారాయణమూర్తి తాజాగా రైతన్న పేరుతో సినిమా తెరకెక్కించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎందరో రైతులు ఢిల్లీలో సాగిస్తున్న ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారట నారాయణ మూర్తి.ఇక ఫిబ్రవరి నెలలో విడుదల అవనున్న ఈ చిత్రానికి రైతు బంద్ అని టైటిల్ మొదట అనుకున్నారట.

TeluguStop.com - ఆర్. నారాయణమూర్తి సినిమా పై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందన ఏంటంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత రైతన్నగా మార్చి ఈ సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ, కేంద్రం నూతనంగా మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురాగా, వాటిని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఈ పోరాటంలో రైతుల ప్రాణాలు కూడా పోతున్నాయి.

ఈ దశలో కేంద్రానికి రైతు సంఘాలకు, మధ్య పలుసార్లు చర్చలు జరిగినా ఉపయోగం లేకుండా పోయింది.ఈ నేపధ్యంలో ఆర్.నారాయణమూర్తి గారు కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతన్న పేరుతో సినిమా తీయడం అభినందనీయం అని కొనియాడారు.

#Rythanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు