టై సరిగ్గా కట్టుకో లేదని పార్లమెంటు నుండి ఎంపీని గెంటేశారు..!!

సాధారణంగా పార్లమెంట్ మరియు చట్టసభలలో చాలా దేశాలలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు డిఫరెంట్ గా జరుగుతాయి.కొంతమంది పేపర్లు చింపేసి నిరసన  తెలుపుతుంటారు, మరికొంతమంది పొడియం వద్ద గట్టి గట్టిగా నినాదాలు చేస్తూ ఉంటారు.

 New Zealand Mp Rawiri Waititi Suspended From The Parliament For Not Tied Properl-TeluguStop.com

మన భారత దేశంలో ఈ విధంగానే నిరసనలు, ఆందోళనలు చట్టసభలలో జరుగుతూ ఉంటాయి.ఈ క్రమంలో స్పీకర్ సభ్యుల చర్యలు శృతిమించితే సభ నుండి సస్పెండ్ చేస్తూ ఉంటారు.

కానీ న్యూజిలాండ్ పార్లమెంటులో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది.

పూర్తి విషయంలోకి వెళితే న్యూజిలాండ్ దేశానికి చెందిన రివైరీ వైటిటి అనే మేజర్ పార్టీకి చెందిన ఎంపీ  సభలో చర్చ జరిగే సమయంలో ఓ ప్రశ్నను అడిగేందుకు ప్రయత్నించాడు.

ఈ విధంగా రెండు సార్లు ప్రయత్నించగా వెంటనే స్పీకర్ కలుగజేసుకుని పార్లమెంట్ సభలో మీకు మాట్లాడే హక్కు లేదని సదరు ఎంపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కారణం చెబుతూ పార్లమెంట్ మరియు దేశ చట్టసభలకు విరుద్ధంగా టై కట్టుకోకుండా వచ్చారని సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు.

దీంతో స్పీకర్ చర్యలకు సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.స్పీకర్ ఆదేశించిన సదరు ఎంపీ లోన ఉండటంతో.భద్రతా సిబ్బంది ఆయనను బయటకు గెంటేయడం జరిగిందట.టై సరిగ్గా కట్టుకో లేదని .

ఎంపీని చట్టసభలో నుండి బయటకు గెంటి వేయడం అనే ఈ వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది.భలే స్పీకర్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Telugu Necktie, Zealand, Suspended-Latest News - Telugu.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube