'నరికే' చట్టం

రాజ్య సభ దద్దరిల్లింది….ఆర్.

 Demand For New Law-TeluguStop.com

పీ.ఐ.ఏ ఎంపీ రాందాస్ అతవాలే రాజ్యసభలో విరుచుకు పడ్డారు.వారం క్రితం జరిగిన ఒక సంఘటన విషయం పై మాట్లాడుతూ.

ఒక మూడేళ్ళ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెళ్లి వేడుకకోసం హోటల్‌కు వెళ్లింది.ఆ తర్వాత ఆ బాలిక కనిపించలేదు.హోటల్ టెర్రేస్‌పై గొంతుకోసి ఉన్న బాలిక మృతదేహం ఆ తర్వాత కనిపించింది.వైద్య పరీక్షల అనంతరం.

ఆ బాలికను రేప్ చేసి ఛంపేసినట్లు తేలింది.దీనిపై అతవాలే ఇలాంటి ఘోరాలపై చట్టాలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.

ఈ విధమైన నేరాలకు పాల్పడే వారి కాళ్లు చేతులు విరిచేసేందుకు వీలుగా ఒక చట్టాన్ని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘రేప్‌లకు పాల్పడే మగవాళ్ల కాళ్లు చేతులు విరిచేయాలి.

ఇందుకోసం పార్లమెంటులో ఒక చట్టం చేయాలి’ అని అతవాలే అన్నారు.లోనావాలాలాంటి కేసుల్లో ఉరితీయడంలాంటి కఠిన శిక్షలు విధించడానికి వీలుందని ఆయన అంటూ అయితే మరో చట్టం కూడా అవసరం ఉందని ఆయన అన్నారు.

ఇక ఆయన మాటలకు నవ్విన మిగిలిన సభ్యులపై అతవాలే సీరియస్ అయ్యారు…తానేమీ కామెడీ చేయదంలేదు అని.మహిళలపై అత్యాచారాలు అనే చాలా సీరియస్ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని ఆయన అన్నారు.నిజంగా చెప్పాలి అంటే అతవాలే ఆవేదన చాలా కరెక్ట్.కఠిన చర్యలు ఉంటే తప్పా…ఇలాంటి ఘోరాలు తగ్గవు.మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube