రాజు గారి మరో లొల్లి ! దాడి జరగబోతోందంటూ ?  

mp ysrcp raghuramakrishnam raju ,narasapuram ,jagan ,delhi, ap cm, Sakshi Channel, BJP And Janasena - Telugu Ap Cm, Bjp And Janasena, Delhi, Jagan, Mp Ysrcp Raghuramakrishnam Raju, Narasapuram, Sakshi Channel

కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ, వైసీపీ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తూ, కంటిలో నలుసుగా ఉన్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉన్నారు.ఏపీ ప్రభుత్వంపై ఏదో ఒక అంశంపై గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు.

TeluguStop.com - Mp Raghuramakrishnamraju Sensational Coments

ఢిల్లీ నుంచి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, ఏపీకి సంబంధించిన అన్ని వివాదాల్లోనూ ఆయన తల దూర్చుతున్నారు.తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు చేసే విమర్శలకు రాజుగారు వంత పాడినట్లుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ హడావుడి చేస్తూనే వస్తున్నారు.అదే విధంగా తన కార్యాలయంపై మరో రెండు మూడు రోజుల్లో దాడి జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు.

TeluguStop.com - రాజు గారి మరో లొల్లి దాడి జరగబోతోందంటూ -Political-Telugu Tollywood Photo Image

దీనికి సంబందించిన కార్యాచరణ కూడా రూపొందించుకున్నారని రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.కొద్ది రోజుల క్రితం తోలు తీస్తా అన్నారని, ఊరికి రా, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తామని హెచ్చరించారని రఘురామకృష్ణంరాజు గుర్తుచేశారు.

ఓ ఎంపీ అన్న వ్యాఖ్యలను తాను ప్రస్తావిస్తే, దానికి ఓ జాతిని అవమానించినట్టు చిత్రీకరించారు అంటూ మండిపడ్డారు.తాను అన్న మాటలకు అన్ని రుజువులు ఉన్నాయని, తన వెనుక జరుగుతున్న కుట్ర తెలియాలని అన్నారు.

తనపై జరగబోయే దాడికి సంబంధించిన వార్తలు సాక్షి ఛానల్, పేపర్లో వస్తాయని రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పారు.తాను వైసీపీలోనే కొనసాగుతున్న అని, కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు.

అలాగే పోలీసు వ్యవస్థ ఓ మతం మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోందని, ఏపీలో ఉన్న పోలీసులకు చట్టాలపై అవగాహన లేదని, ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎంతోమంది దళిత సంఘాల నాయకులు తనకు ఫోన్ చేస్తున్నారని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని, వారి హక్కుల కోసం తాను పోరాడడం తోనే తనకు ఈ రకంగా మద్దతుగా నిలబడేందుకు సిద్ధమయ్యారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

#MpYsrcp #AP Cm #Narasapuram #Sakshi Channel #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mp Raghuramakrishnamraju Sensational Coments Related Telugu News,Photos/Pics,Images..