నన్ను చంపేందుకు సీఎం జగన్‌ చూస్తున్నారు.. మోడీకి ఫిర్యాదు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనను చంపేందుకు కడప జిల్లాకు చెందిన తన పాత పరిచయస్తులతో సంప్రదింపులు జరుపుతున్నాడు అంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు.ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయమై లేఖ రాయడం జరిగింది.

 Mp Raghuramakrishnam Raju Latter To Pm Narendra Modi-TeluguStop.com

కడప జిల్లాకు చెందిన ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ తో నన్ను హత్య చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.తనకు హైదరాబాద్‌ మరియు ఏపీకి వెళ్లిన సమయంలో వై కేటగిరి భద్రత కల్పిస్తున్నారు.

తన ఆందోళన నేపథ్యంలో ఢిలీల్లో ఉన్న సమయంలో కూడా భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.

 Mp Raghuramakrishnam Raju Latter To Pm Narendra Modi-నన్ను చంపేందుకు సీఎం జగన్‌ చూస్తున్నారు.. మోడీకి ఫిర్యాదు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైకాపా తరపున పోటీ చేసి గెలిచిన రఘు రామ కృష్ణం రాజు ఇప్పుడు ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయాడు.

ఆయన అధినేత వైఎస్‌ జగన్‌ రెడ్డి కి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది.ఇక వైఎస్‌ జగన్‌ పరిపాలనలో జరుగుతున్న అక్రమాల గురించి పార్లమెంట్‌ లో ప్రస్థావిస్తానంటూ రఘురామ కృష్ణంరాజు బాహాటంగానే ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో వైకాపా నుండి కొందరు తనను బౌతిక దాడులకు పాల్పడుతామంటూ హెచ్చరిస్తూ బెదిరిస్తున్నారంటూ మోడీ కి రాసిన లేఖలో రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నాడు.వైకాపా నాయకులను మరియు సీఎం జగన్‌ ను ఇంకా ఇంకా రఘు రామ కృష్ణం రాజు బెదిరిస్తూనే ఉన్నాడు.

#Ysrcp #YS Jagan #RaghuRama #Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు