కాలుష్యం కోరల్లో ఎంపీ నామా చెక్కర ఫ్యాక్టరీ..

ఇది ఖమ్మం జిల్లాలోని పాలేరు నిజయోజకవర్గంలోని… చెన్నారం గ్రామం….గంభీరంగా కనిపించే ఈ గ్రామంలో క్యాన్సర్ భూతం వీరవిహారం చేస్తోంది.

 Mp Nama Sugar Factory In Koralo Due To Pollution , Mp Nama, Sugar Factory, Chenn-TeluguStop.com

ఇక్కడ నివశించే వారిలో దాదాపు 30 శాతం మందికి ఇప్పటికే క్యాన్సర్ సోకింది.దీనికి కారణం ఇక్కడ పండించే చెరకు పంట… ఇక్కడ ఉండే చెరకు ఫ్యాక్టరీ… ఈ ప్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్లనే చాలా మంది క్యాన్సర్ కు గురవుతున్నట్లు నిపుణులు గుర్తించినా… ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం బయటకు రాకుండా అడ్డుకోలేకపోతున్నారు.

తమను కాలుష్యం నుంచి కాపాడాలని… ఫ్యాక్టరీని మూసివేయాలని… అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినే నాథుడు లేడు.దీనికి కారణం ఆ ఫ్యాక్టరీ అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడమే.

గత నాలుగేళ్లలో చెన్నారం గ్రామంలో పది మంది కి పైగా కాన్సర్ కారణంగా మృతి చెందారు.చెన్నారం అనే చిన్న గ్రామంలో పదుల సంఖ్యలో కాన్సర్ కేసులు నమోదవడం ఒక అంశం అయితే … ఇంత పెద్ద ఎత్తున కాన్సర్ కేసులు నమోదైనా ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా ఉంటే ఎంపీకి చెందిన చెరుకు ఫ్యాక్టరీ కాలుష్యం కారణంగా చెన్నారం గ్రామం మాత్రమే కాదు చుట్టుపక్కల ఏడు గ్రామాల వరకు ఈ కాలుష్యం వ్యాపించి… క్యాన్సర్ బాధితుల సంఖ్యను పెంచుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Telugu Chennar, Mp Nama, Mpnama, Control Board, Sugar Factory-Political

అధికార పార్టీకి చెందిన ఫ్యాక్టరీ కావడంతో… పోల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ వైపు కన్నేత్తి చూడటంలేదు.ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈ విషయంపై పలు ప్రజా సంఘాలు విన్నవించినా… ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే కాలుష్యాన్ని శుద్ధి చేసి పంపాలన్న విషయాన్ని మాత్రం ఆయన ఆలోచించడంలేదు.వాస్తవానికి ఇంత పెద్ద ఫ్యాక్టరీకి ఇప్పటికీ పొల్యూషన్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లేకుండా ఉండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేరకు కాలుష్యాన్ని వెదజల్లుతుందని స్థానికులు అంటున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలిని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube