దాతృత్వాన్ని చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. యువకునికి ఆర్థిక చేయూత

నల్గొండ జిల్లా: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు.ఫైటర్ పైలట్ కోర్సు శిక్షణకు ఎంపికైన యువకునికి ఆర్థిక చేయూత.

 Mp Komati Reddy Venkatreddy Financial Help To Ashok Who Selected For Fighter Pil-TeluguStop.com

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన పున్న అశోక్ ఇటీవల ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపికయ్యారు.అయితే మొదటగా శిక్షణకు వెళ్లాల్సి ఉండడంతో అందుకు అయ్యే ఖర్చుకు స్తోమత లేకపోవడంతో అతని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

దింతో విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించి అశోక్ సాయిని హైదరాబాద్ లోని తన ఇంటికి పిలిపించుకుని భరోసా కల్పించారు.

పైలట్ శిక్షణ కంప్లీట్ అయ్యే వరకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని హామీ ఇచ్చారు.

ప్రతీ ఏడాదీ శిక్షణకు అయ్యే 51 వేల తో పాటు అన్నిరకాలుగా అండగా ఉంటానని కోమటిరెడ్డి పైలెట్ కు ధైర్యాన్ని ఇచ్చారు.దింతో అశోక్ తీవ్ర భావోద్వేగం గురయ్యారు.

తను కష్టపడి చదివి ఫైటర్ పైలట్ శిక్షణకు ఎంపికైనా డబ్బులు లేకపోవడంతో ట్రైనింగ్ కు వెళ్లలేనేమోనని భయం‌ వేసిందని కానీ కోమటిరెడ్డి నన్ను ఇంటికి పిలిపించుకుని ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.

ఎంపీ కోమటిరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఆయన ఆశలు వమ్ము చేయకుండా కష్టపడి ట్రైనింగ్ పూర్తి చేస్తానని చెప్పారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ శిక్షణ పూర్తి చేసుకోవడానికి అండగా ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.దింతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube