మరో తలనొప్పి తెచ్చిన కేశినేని నాని  

Mp Kesineni Nani Controversial Comments-

గత కొద్దీ రోజులుగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి ఆ పార్టీ కి తలనొప్పిగా మారింది.ఆ పార్టీ పై అసంతృప్తి చెందిన కేశినేని నాని ఒక్కోసారి విపరీత చర్యలకు పాల్పడి వార్తల్లో నిలుస్తున్నారు.మొన్నటికి మొన్న చీఫ్ విప్ పదవి ని ఆఫర్ చేయగా నేను దానికి అర్హుడను కాను మరెవరినైనా ఆ పదవిలో ఎన్నుకోవాలి అంటూ సున్నితంగా తిరస్కరించిన నాని మనసులో ఎదో విషయం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు...

Mp Kesineni Nani Controversial Comments--MP Kesineni Nani Controversial Comments-

ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని -తోటి టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ – రామ్మోహన్ నాయుడులకు బాబు అందలం ఎక్కివ్వడాన్ని జీర్ణించుకోలేని ఆయన గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా సాక్షిగా ఆ పార్టీ పై పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కుతున్నారు.తరచూ ఎదో ఒక దుందుడుకు చర్యకు పాల్పడి చంద్రబాబును ఇరుకునపెడుతున్నారు.

Mp Kesineni Nani Controversial Comments--MP Kesineni Nani Controversial Comments-

ఇప్పుడు తాజాగా పార్టీ అధినేత చంద్రబాబును సంప్రదించకుండానే తనంతట తానుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం మరోసారి ఆ పార్టీలో కాకరేపుతోంది.టీడీపీ అధిష్టానానికి చెప్పకుండానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని ఎంపీ కేశినేని నాని నిర్వహించడం దానికి నియోజకవర్గ కార్పొరేటర్లు – నాయకులు – మాజీ కార్పొరేటర్లు సహా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.అంతటితో ఆగకుండా తనకు అత్యంత ఆప్తుడైన మైనార్టీ టీడీపీ నేత ‘నాగుల్ మీరా’ను వచ్చేసారి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేస్తారని నాని ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.ఇప్పుడిదే ఆ పార్టీలో దుమారం రేపుతోంది.