కేసీఆర్ కుమార్తెకు టెన్ష‌న్ ఎందుకు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత అంటేనే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ ఫైర్‌బ్రాండ్‌.ఇక టీఆర్ఎస్‌లో అయితే ఏకంగా సీఎం గారాలప‌ట్టి కావ‌డంతో చాలా విష‌యాల్లో ఆమె చెప్పిందే వేదం.

 Mp Kavitha Tension Paduthundha..!-TeluguStop.com

గ‌త ఎన్నిక‌ల్లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి నిజామాబాద్ ఎంపీ సీటు నుంచి భారీ మెజార్టీతో గెలిచిన క‌విత ఈ నాలుగేళ్ల‌లో రాజ‌కీయంగా స్థానికంగా కంటే స్టేట్ లీడ‌ర్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేశారు.

విప‌క్షాల నుంచి త‌ర‌చూ వినిపించే కేసీఆర్ ఫ్యామిలీలో ఈ న‌లుగురితే అధికారం అన్న విమ‌ర్శల్లో ఆమె కూడా ఉన్నారు.

కేసీఆర్ ఫ్యామిలీ అంటే కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్‌రావుతో పాటు ఎంపీ క‌విత కూడా ఉన్నార‌న్న‌ది తెలిసిందే.ఇక కొద్ది రోజుల క్రితం ఆమె కేంద్ర మంత్రి ప‌ద‌వి మీద ఆశ‌లు పెట్టుకున్నార‌ని.

ఆ కోరిక తీరే ఛాన్సులు లేక‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె జ‌గిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్టేట్ కేబినెట్‌లో మంత్రి అయ్యే ప్లాన్ చేస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఉన్న పొలిటిక‌ల్ ప‌రిస్థితుల‌ను, టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం క‌విత సీటును కేసీఆర్ మార్చే ప్ర‌శ‌క్తే లేదంటున్నారు.అయితే క‌విత మ‌ళ్లీ ఎంపీగా పోటీ చేస్తే గెలుపు మాత్రం అంత స‌లువు కాదు.ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు తీవ్ర‌మైన ఎదురుగాలి వీస్తోంది.2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌విత కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కిపై 1.67 లక్షల మెజారిటీతో విజయం సాధించారు.

ఇక నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న అసెంబ్లీలో సెగ్మెంట్ల‌లో ఉన్న వ్య‌తిరేక‌త‌తో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అరవింద్ బీజేపీలో చేర‌డంతో ఇక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు శ‌ర‌వేగంగా మారుతున్నాయి.నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి మంచి ప‌ట్టు ఉంది.

గ‌తంలో బీజేపీ ఇక్క‌డ ఒంట‌రిగా పోటీ చేసి ఏకంగా డీఎస్‌నే ఓడించిన చ‌రిత్ర ఆ పార్టీది.ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీ చేతిలో డీఎస్ ఓడారు.

ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అర‌వింద్ ఇక్క‌డ బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేయ‌డం దాదాపు ఖరారైంది.ఆయ‌న సామాజిక ప‌రంగాను, యూత్ ప‌రంగాను, ఆర్థిక కోణంలో బ‌ల‌మైన అభ్య‌ర్థి కానున్నారు.

ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని సెగ్మెంట్ల‌లో బీజేపీకి మంచి ప‌ట్టు ఉంది.ఈ ఎంపీ సీటు ప‌రిధిలో బోధ‌న్‌, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్‌ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

ఇక్క‌డ గ్రూపు రాజ‌కీయాల‌తో పాటు షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ, ప‌సుపు బోర్డు ఏర్పాటు అంశంలో క‌విత‌కు మైన‌స్ మార్కులే ఉన్నాయి.ఇక ఆమె ద‌త్త తీసుకున్న జగిత్యాల జిల్లా అంతర్ఘాం, బోధన్ జిల్లా కందకుర్తి గ్రామాలు కూడా అభివృద్ధికి నోచుకోలేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇక వీటన్నింటికంటే వ‌చ్చే ఎన్నిక‌ల టైంకు డీఎస్ కాంగ్రెస్‌లో చేరిపోతార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ ప‌రిణామాల‌న్ని క‌విత‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అంత వీజీ కాద‌ని చెపుతున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube