కవితకు కోపం వచ్చింది: మధు యాష్కీకి నోటీసు పంపింది  

టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవితకు కోపం వచ్చింది. గత కొద్ది రోజులుగా … టీఆర్ఎస్ పార్టీ మీద …ఆ పార్టీ నాయకుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత మీద కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కునే దమ్ము లేక యాష్కి ఇలా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ పరపతి దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, తన లాయర్‌ ద్వారా ఆయనకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు.

Mp Kavitha Send To Legal Notice From Madhu Yashki-

Mp Kavitha Send To Legal Notice From Madhu Yashki

రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తన భ‍ర్తపై ఆధారాలు లేని అవాస్తవాలు, ఆరోపణలు చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల, తన భర్త పట్ల వాడిన అసభ్య పదజాలాన్ని వాపస్‌ తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కవిత నోటీసు పంపుతున్నట్లు ప్రకటించారు.