ఆ కడప సీఎం గెడ్డం పెంచుతాడట ... శంకుస్థాపన చేస్తేనే తీస్తాడట !

ఇప్పడు దేశమంతా ఛాలెంజ్ లతో మారుమోగుతోంది.బకెట్ ఛాలెంజ్.

 Mp Cm Ramesh To Grow Beard For Kadapa Steel Plant-TeluguStop.com

ఫిట్నెస్ ఛాలెంజ్ ఇలా ఏదో ఒక ఛాలంజ్ నడుస్తూనే ఉన్నాయి.అయితే అందరూ అన్ని ఛాలంజ్ లు చేస్తున్నారు నేను ఊరుకుంటే ఎం బాగుంటుంది అనుకున్నాడో ఏమో కానీ కడప సీఎం గెడ్డం ఛాలెంజ్ చేసేసాడు.

అయితే ఆ ఛాలెంజ్ ఎవరికీ కాదు.కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే తాను గెడ్డం తీయాయబోనని ప్రకటించాడు కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్.

ఈ గడ్డం చాలెంజ్‌లో తెలుగు రాష్ట్రాల నేతలు ఇద్దరు ముగ్గురు ఇప్పటికే ఉన్నారు.కడప జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి మూడేళ్ల పాటు గడ్డం తీయకుండా.

గండికోట ప్రాజెక్టు కోసం పోరాడారు.గండికోట ప్రాజెక్ట్ ను పూర్తి చేసి పులివెందులకు నీళ్లిచ్చిన తర్వాతే గడ్డం తీస్తానని ప్రకటించారు.

చివరికి పులివెందులలో నీళ్లు పారిన తర్వాతే గడ్డం తీశారు.అలాగే.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా.ప్రస్తుతం ఈ గడ్డం చాలెంజ్‌లో ఉన్నారు.

కాంగ్రెస్ గెలిస్తేనే గడ్డం తీస్తానని ప్రకటించారు.

కడప ఉక్కు పరిశ్రమ కోసం కొద్ది రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేసిన సీఎం రమేష్ పూర్తిగా కోలుకున్నారు.ఆ తరువాత తిరుమల శ్రీవెంకటేశ్వరుడ్ని దర్శనం చేసుకుని కొత్తగా ఓ చాలెంజ్ చేశారు.కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరిగే వరకూ గడ్డం తీయబోనని ప్రకటించారు.

స్టీల్ ఫ్యాక్టరీ కోసం.పార్లమెంట్‌లో కూడా పోరాడతానని.

సాధించే వరకూ వదలబోనని స్పష్టం చేశారు.పదకొండు రోజుల దీక్ష తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రమేష్‌తో దీక్ష విరమింపచేశారు.

అప్పుడే ఆయనను ఆస్పత్రికి తరలించారు.

కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

కేంద్రానికి రెండు నెలల గడువు పెట్టారు.ఈ లోపు కేంద్రం నిర్ణయం తీసుకుని శంకుస్థాపన చేయకపోతే.

తామే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటామని ప్రకటించారు.సింగపూర్ పర్యటనలో చంద్రబాబు.

ఓ ఆస్ట్రేలియన్ కంపెనీతో.కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు కూడా.! మెకాన్ నివేదిక వచ్చిన తర్వాత కేంద్రం ఓ నిర్ణయం తీసుకోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.ఈ ధైర్యంతోనే సీఎం రమేష్ గడ్డం చాలెంజ్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube