లోకేష్ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి..!!

టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం పై తాజాగా మండిపడ్డారు.ఈ విషయంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మొదటినుండి మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Mp Avinash Reddy Says Lokeshs Remarks Are Not True-TeluguStop.com

ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం వేసిన కమిటీ లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు అంటూ నారా లోకేష్ తాజాగా చేసిన కామెంట్లను అవినాష్ రెడ్డి ఖండించారు.

లోకేష్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలిపారు.

 Mp Avinash Reddy Says Lokeshs Remarks Are Not True-లోకేష్ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను స్టీల్ ప్లాంట్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నానంటూ తాను సరిగ్గా మాట్లాడటం సరైనది కాదని పేర్కొన్నారు.లోకేష్ ఆరోపణలు వింటుంటే హాస్యాస్పదంగా ఉంది అంటూ కొట్టిపారేశారు.

అదే విధంగా మంత్రి పెద్దిరెడ్డి పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై కామెంట్ చేయడం సమంజసం కాదు అంటూ హితవు పలికారు.విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు, ఇప్పటికే ఈ విషయంలో సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసినట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.

#Kadapa #Lokesh #Avinash Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు