వైసీపీ నాయకులకి ఖాకీ ప్రతాపం! ప్రచారంలో పాల్గొనకుండా హౌస్ అరెస్ట్! Telugu Telivisio TV Anchors Profile & Biography  

మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందులలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. .

  • ఏపీలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రావాలి జగన్, కావాలి జగన్ అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంది. వాటి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాలని ప్రజలలోకి తీసుకెళ్ళి వైసీపీ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జమ్మలమడుగులో ఓ గ్రామంలో వైసీపీ ప్రచారానికి రెడీ అయిన వైసీపీ నేత అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. శాంతి భద్రతలని ద్రుష్టిలో వుంచుకొని ప్రచార కార్యక్రమాలలో పాల్గొనకుండా నియంత్రిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

  • అయితే ఈ విషయంలో వైసీపీ పార్టీ శ్రేణులు మాత్రం చాలా సీరియస్ గా వున్నాయి. కావాలనే అధికార పార్టీ తమని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని అవినాష్ రెడ్డి వాఖ్యానిస్తున్నారు. మరో వైపు మంత్రి ఆదినారాయణ రెడ్డి తనయుడు సుదీర్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో కేవలం శాంతి భద్రతలని ద్రుష్టిలో వుంచుకొని పోలీసులు జమ్మలమడుగులో ఈ ఇద్దరు నేతలని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.