దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తున్నా

నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విభిన్నంగా స్పందించాడు.99.9 శాతం మంది దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నారు.ఎవరైతే ఆ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తున్నారో వారిలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా ఉన్నాడు.

 Mp Assadudduin Owaisi-TeluguStop.com

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వ్యక్తం చేశాడు.ప్రస్తుతం ఢిల్లీలో లోక్‌సభ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన ఎన్‌కౌంటర్‌పై స్పందిచాడు.

ఎన్‌కౌంటర్‌ జరగడంపై ఆయన విచారం వ్యక్తం చేశాడు.దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌ అనేది ప్రస్తుతం మానవ హక్కుల కమీషన్‌ స్వీకరించింది.ప్రస్తుతం విచారణ జరుగుతుంది.పోలీసులు మానవ హక్కుల సంఘంకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే.

ఎన్‌కౌంటర్స్‌ అనేవి నేను వ్యక్తిగతంగా విమర్శిస్తాను.నేను ఎప్పుడు కూడా ఎన్‌కౌంటర్‌లను సమర్ధించను అంటూ ఎంపీ చెప్పుకొచ్చాడు.

ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడాలి తప్ప ఇలాంటి సంఘటనలు సరికాదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube