హుజూరాబాద్‌ రాని ఎంపీ అర‌వింద్‌.. సైలెంట్ వెన‌క కార‌ణ‌మేంది?

ప్ర‌స్తుతం తెలంగాణ మొత్తం రాజ‌కీయాలు హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి.ఎలాగైనా గెల‌వాల‌ని టీఆర్ ఎస్‌, బీజేపీ వ్యూహాల మీద వ్యూహాలు ర‌చిస్తున్నాయి.

 Mp Arvind Not Coming To Huzurabad .. What Is The Reason Behind Silent Mp Aravin-TeluguStop.com

బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీ చేయ‌డంతో ఎలాగైనా గెలుస్తామ‌నే ధీమాలో ఆ పార్టీ నేత‌లు ఉన్నారు.ఇప్ప‌టికే వ‌రుస‌గా ఇన్‌చార్జుల‌ను నియ‌మిస్తూ రోడ్ షోలు, ప్ర‌చారాల‌తో దూసుకుపోతున్నారు.

కానీ పార్టీలో కీల‌క‌మైన ఓ మాస్ లీడ‌ర్ మాత్రం ఈట‌ల వ్య‌వ‌హారానికి దూరంగా ఉంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్‌ను క‌లిసి చ‌ర్చించ‌లేదు.

అలాగే క‌నీసం ఈట‌ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కామెంట్లు పెద్ద‌గా చేయ‌ట్లేదు.అంద‌రు నేత‌లు హుజూరాబాద్‌కు వ‌స్తూ కార్య‌క‌ర్త‌ల‌ను స‌మాయాత్త చేస్తూ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు.

కానీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి మాస్ లీడ‌ర్‌గా పేరున్న ధ‌ర్మ‌పురి అర‌వింద్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు హుజూరాబాద్‌కు రాలేదు.క‌నీసం కామెంట్లు కూడా చేయ‌ట్లేదు.

దీంతో ఆయ‌న మౌనం వెన‌క అర్థం ఏంటో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

Telugu @bjp4telangana, Bandi Sanjay, Dharmapuri Mp, Etala, Etala Rajender, Huzur

అయితే ఈట‌ల రాజేంద‌ర్ వ‌చ్చిన త‌ర్వాత‌నే ఆయ‌న పార్టీ ప‌రంగా మౌనంగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.దీనికి కార‌ణం ఏంటో అర్థం కావ‌ట్లేదు.ఈట‌ల రాజేంద‌ర్‌ను బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకు తెస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రిగినా ఇప్పుడు బండి సంజ‌య్ ముందుండి హుజూరాబాద్ ఎన్నిక‌ల‌ను న‌డిపిస్తున్నారు.

ఇప్ప‌టికే ఆయ‌న అన్ని మండ‌లాల‌కు ఇన్ చార్జుల‌ను కూడా నియ‌మించారు.ఇందులో ధ‌ర్మ‌పురి అర‌వింద్‌కు జ‌మ్మికుండ మండ‌లానికి ఇన్ చార్జిగా నియ‌మించారు.కానీ ఆయ‌న మాత్రం దీనిపై ఏం స్పందించ‌ట్లేదు.అయితే ఆయ‌న కావాల‌నే మౌనంగా ఉంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఒక వేళ ఈట‌ల రాజేంద‌ర్ గ్రాఫ్ పెర‌గ‌కుండా ఉండేందుకు ఆయ‌న ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు బీజేపీలో క‌లుగుతున్నాయి.ఏదేమైనా మాస్ ఫాలోయింగ్ ఉన్న అర‌వింద్ ఇప్పుడు సైలెంట్ అయ్యార‌నే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube