నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్‎గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి..!

MP Adala Prabhakar Reddy As In-charge Of Nellore Rural YCP..!

నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్‎గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నియమితులైయ్యారు.ఈ మేరకు ఆదాల పేరును వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఖరారు చేశారు.

 Mp Adala Prabhakar Reddy As In-charge Of Nellore Rural Ycp..!-TeluguStop.com

దీంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరపు నుంచి ఆదాల పోటీకి దిగనున్నారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ తనకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు.

జగన్ అంచనాలకు తగ్గట్టు పనిచేస్తానని స్పష్టం చేశారు.భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం పార్టీ ఇంఛార్జ్ గా ఆదాలను ఫైనల్ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube