దారుణం : మామిడి చెట్టుపై ప్రసవం... శిషువుతో రెండు రోజులు చెట్టుపైనే ఉన్న మహిళ  

Mozambique Woman Gives Birth In Mango Tree During Floods-cyclone Idai,devastating Flooding,mozambique Woman,మామిడి చెట్టుపై ప్రసవం

ఆఫ్రికాలోని ప్రస్తుతం కొన్ని దేశాల్లో తుఫాను ముంచెత్తుతోంది. ప్రతి ఏడాది కూడా అక్కడ పలు దేశాలు తుఫాన్‌ ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా ఆఫ్రికా దేశం అయిన మొజాంబిక్‌లో దారుణం జరిగింది...

దారుణం : మామిడి చెట్టుపై ప్రసవం... శిషువుతో రెండు రోజులు చెట్టుపైనే ఉన్న మహిళ-Mozambique Woman Gives Birth In Mango Tree During Floods

తుఫాన్‌ కారణంగా అక్కడ అయిదు లక్షల మంది ప్రజలు ఉండేందుకు ఇళ్లు లేకుండా కోల్పోయారు. అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న ఆ దేశంలో ఒక మహిళ తుఫాన్‌ కారణంగా మామిడి చెట్టుపై ప్రసవించింది. ఆమె రెండు రోజుల పాటు నరకయాతన అనుభవించింది.

కొన్ని వారల క్రితం మొజాంబిక్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు మరియు గంటలకు 175 కిలో మీటర్ల వేగంతో గాలులు వచ్చిన కారణంగా లక్షలాది ఇళ్లులు మునిగి పోవడంతో పాటు, కొన్ని ఇళ్లులు కనుమరుగయ్యాయి. ఆ సమయంలోనే అమేలియా అనే నిండు గర్బవతి కూడా తన ఇంటిని కోల్పోయింది. తన వెంట ఉన్న చిన్న బాబును మరియు తన కడుపులో ఉన్న శిషువును కాపాడుకునేందుకు ఇంటి వద్దనే ఉన్న మామిడి చెట్టు ఎక్కింది.

చుట్టు నీరు, పక్కన ఎవరు లేకపోవడంతో ఆమె ఎంతో మానసిక ఆవేదన అనుభవించింది. ఆ సమయంలోనే ఆమెకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొడుకును పక్కన కూర్చోబెట్టి తనకు తానుగా పురుడు పోసుకుంది. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె రెండు రోజుల పాటు చెట్టు మీదే ఉంది.

చుట్టు ఉన్న నీరుతో పాటు విపరీతమైన గాలి, వర్షం బారి నుండి తన కొడుకు మరియు అప్పుడే పుట్టిన కూతురును కంటికి రెప్పలా చూసుకుంది. రెండు రోజుల తర్వాత స్థానికుల సాయంతో కిందకు దిగింది. వెంటనే తల్లి, బిడ్డను హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు...

ప్రస్తుతం ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు.