‘రాధే శ్యామ్’ సహా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన.. టాలీవుడ్ టాప్ 10 సినిమాలు ఇవే?

ఒకప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే సాధ్యం అయ్యేది.కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎన్నో హాలీవుడ్ సినిమాలు కూడా వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఉండడం గమనార్హం.

 Movies With High Pre Release Business Radhe Shyam Bheemla Nayak Sahoo Bahubali D-TeluguStop.com

ఇలా టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.ఇక ఒక్కసారి ఆ లిస్టు చూసుకుంటే…

బాహుబలి 2 :

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సెకండ్ పార్ట్ ఊహించని రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఇక ఎక్కువ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ప్రస్తుతం టాప్ లో కొనసాగుతుంది.ఏకంగా ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి 352 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డులు తిరగరాసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఏకంగా బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది

సాహో :

బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన సాహో సినిమా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన రెండవ సినిమాగా నిలిచింది.మొత్తంగా 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా.

తెలుగులో అవరేజ్ అనిపించుకున్నప్పటికి బాలీవుడ్లో మాత్రం హిట్ అయింది.

Telugu Agnathavasi, Bahubali, Bheemla Nayak, Maharshi, Pre, Pushpa, Radhe Shyam,

రాధేశ్యామ్ :

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా తెలుగులోనే వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 202.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం గమనార్హం.ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలో మొదటి మూడు స్థానాలలో ప్రభాస్ సినిమాలే ఉండటం గమనార్హం.

సైరా నర్సింహారెడ్డి :

చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఏకంగా 187.25 కోట్లకు రిలీజ్ బిజినెస్ చేసింది.ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటడం గమనార్హం.

Telugu Agnathavasi, Bahubali, Bheemla Nayak, Maharshi, Pre, Pushpa, Radhe Shyam,

పుష్ప :

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన కొత్త సినిమా 144.9 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడం గమనార్హం.ఇక ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే.

స్పైడర్ :

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ సినిమా 124.8 కోట్లు ప్రీ రిలీస్ బిజినెస్ చేసింది.కానీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

Telugu Agnathavasi, Bahubali, Bheemla Nayak, Maharshi, Pre, Pushpa, Radhe Shyam,

అజ్ఞాతవాసి :

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి సినిమా 124.6 కోట్లు ప్రీరిలీజ్ చేసింది కానీ సినిమా మాత్రం విడుదలైన తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది.

బాహుబలి 1 :

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా బాహుబలి ఫస్ట్ పార్ట్ 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి తెలుగులో తొలిసారి వంద కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమాగా రికార్డు సృష్టించింది.

Telugu Agnathavasi, Bahubali, Bheemla Nayak, Maharshi, Pre, Pushpa, Radhe Shyam,

భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్ రాణా కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా 106.25 కోట్లు రిలీజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది.

మహర్షి :

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.అటు వసూళ్లలో కూడా దుమ్ముదులిపి మంచి విజయం సాధించింది.ఇలా టాలీవుడ్లో వంద కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

ఇక టాప్ టెన్ లో మాత్రం ఇవి కొనసాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube