సినిమా తీసేటప్పుడు దర్శక నిర్మాతలు కచ్చితమైన ప్లాన్ వేసుకుంటారు.ఎప్పుడు సినిమా మొదలు పెట్టాలి.
ఎప్పుడు పూర్తి చేయాలి.ఎన్ని రోజులు అదనపు హంగులు అద్దాలి.
ఎప్పుడు రిలీజ్ చేయాలని అనే విషయాల్లో చాలా కచ్చితత్వం పాటిస్తారు.కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
కానీ కొన్ని బాగా ఆలస్యమైపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏళ్లకు ఏళ్ళు సినిమా కోసం టైం తీసుకున్న చిత్రాలు అనేకం ఉన్నాయి. అలా ఎక్కువ కాలం షూటింగ్ సాగిన చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భక్త రామదాసు
తొలితరం టాలీవుడ్ సూపర్ స్టార్ గా చెప్పుకునే చిత్తూరు నాగయ్య నటించిన భక్త రామదాసు 1957లో షూటింగ్ మొదలయ్యింది.ఆర్ధిక సమస్యలు, నటీనటుల గొడవలతో సినిమా పూర్తికావడానికి ఏడేళ్లు పట్టింది.1964లో రిలీజయింది.అత్యధికకాలం సినిమా షూటింగ్ సాగిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
లవకుశ
ఎన్టీఆర్ నటించిన లవకుశ 1958లో షూటింగ్ ప్రారంభమై.1963లో రిలీజయింది.5 లక్షల బడ్జెట్ తో మొదలైన ఈ మూవీ కలర్ తదితర కారణాలతో 50 లక్షలకు చేరింది.
అమ్మోరు
అమ్మోరు సినిమా గ్రాఫిక్స్ మూవీస్ కి టాలీవుడ్ లో బాటలు వేసింది.1992లో షూటింగ్ స్టార్ట్ చేసి,1995లో పూర్తిచేసుకుని రిలీజయింది.ఒకసారి తీసిన సినిమా మొత్తం తొలగించి, రెండోసారి మళ్ళీ ఈ సినిమా తీశారు.
బాహుబలి
ఇక రెండు భాగాలుగా రాజమౌళి తీసిన బాహుబలి.2013లో స్టార్ట్ చేస్తే 4ఏళ్ళు పట్టింది.తెలుగులో వందల కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది.కథకు సంబందించిన అంశాలు, గ్రాఫిక్స్ వలన ఆలస్యమైంది.
అరుంధతి
2006లో షూటింగ్ స్టార్ట్ చేసిన అరుంధతి 2009లో రిలీజయింది.బడ్జెట్ సమస్యలతో షూటింగ్ ఆలస్యమైంది.
నిప్పురవ్వ, గాండీవం
షూటింగ్ లో ప్రమాదాలు, బడ్జెట్ లో మార్పులు, హీరో, హీరోయిన్ మధ్య ఈగో కారణంగా 1991 నుంచి రెండేళ్ల పాటు నిప్పురవ్వ షూటింగ్ సాగింది.అలాగే బాలయ్య గాండీవం మూవీ 1992లో షూటింగ్ స్టార్ట్ అయి.ఆర్ధిక కారణాలతో రెండేళ్లపాటు షూటింగ్ నడిచింది.
ఆటోనగర్ సూర్య
నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య మూవీ రెండున్నరేళ్లు షూటింగ్ జరుపుకుంది.
సాహో, సైరా
ఇక సాహో, సైరా మూవీస్ కూడా రెండేళ్లు షూటింగ్ నడిచాయి.
బాలయ్య భైరవద్వీపం, నాగార్జున రక్షకుడు, ఆకాశవీధిలో, వెంకటేష్ దేవీపుత్రుడు, పవన్ కళ్యాణ్ కొమరం పులి, మహేష్ బాబు ఒక్కడు, ఖలేజా,ఎన్టీఆర్ అదుర్స్ రామ్ చరణ్ మగధీర ఒకటిన్నర ఏళ్ళు పట్టాయి.ప్రభాస్ తాజా మూవీ రాధేశ్యాం కూడా ఒకటిన్నరేళ్ళు పట్టింది.
రాజమౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండున్నరేళ్లుగా షూటింగ్ దశలోనే ఉంది.