సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

సాధారణంగా కొన్ని సినిమాలు వినోదాన్ని ఇస్తే.మరికొన్ని సినిమాలు ప్రజలలో చైతన్యాన్ని కల్పిస్తాయి.

 Movies Which Are Effected On Common People, Tollywood Movies, Effected Common Pe-TeluguStop.com

అయితే ప్రజలను ప్రభావితం చేసిన సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.ఇక గూడవల్లి రామబ్రహ్మం డైరెక్షన్ లో 1930లో వచ్చిన మాలపిల్ల మూవీ అంటరానితనం,కుల వివక్షత,కులాంతర వివాహం,దళితుల ఆలయ ప్రవేశానికి అడ్డంకులను ఆవిష్కరించారు.

ఈ సినిమా బ్రాహ్మణ యువకుడు, దళిత యువతి చుట్టూ తిరుగుతుంది.అప్పట్లో ఈ సినిమా మంచి విజయతోపాటు పలువురి నుండి విమర్శలు కూడా అందుకుంది.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు రేపింది.ఇక అప్పట్లోనే తెలుగు సినిమా చరిత్రలో రెండు కోట్లు వసూలు చేసింది.

అంతేకాదు.స్కూల్స్ ,కాలేజీల్లో సీతారామరాజు గెటప్స్ లో వందేమాతరం అనడం ఈ సినిమాతోనే ప్రారంభమైంది.

ఇక ప్రముఖ దర్శకుడు గౌతమ్ ఘోష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా మా భూమి.ఈ సినిమాలో తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనను, వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర కార్మికుల గురించి ఆవిష్కరిస్తూ,కళ్ళకు కట్టినట్లు చూపించారు.కాగా.ఈ మూవీకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి.

Telugu Chiranjeevi, Common, Maa Bhoomi, Maalapilla, Maheshbabu, Rudraveena, Srim

ఇక కళాతపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం మూవీ ఒక ట్రెండ్ సెట్టర్.ఈ చిత్రం ద్వారా ఎంతోమంది తమ పిల్లలకు సంగీతం నేర్పిచేలా చేసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు అందుకుని, పలు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నిల్చింది.అంతేకాదు.తమిళం,మలయాళం లో కూడా ఈ మూవీ మంచి విజయని అందుకుంది.కె బాలచందర్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో తమను తాము ఉత్తమ పౌరులుగా మలుచుకున్న ఘటనలు ఆసక్తికరంగా చూపించారు.

Telugu Chiranjeevi, Common, Maa Bhoomi, Maalapilla, Maheshbabu, Rudraveena, Srim

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీ పల్లెల దత్తత నేపథ్యంలో తెరకెక్కించారు.అంతేకాక.మహేష్ నటించిన మహర్షి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా ఓ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఓ గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ మూవీ ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో కదలిక తీసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube