ఒమిక్రాన్ పేరుతో వచ్చిన సినిమాలు ఏంటి? అందులో ఏం చూపించారో తెలుసా?

కరోనా మహమ్మారి రోజు రోజుకు తన రూపాన్ని మార్చుకుని మనుషుల మీద దాడి చేస్తుంది.ఇంత వరకు వచ్చిన వేరియంట్ల కన్నా తాజాగా మరో పవర్ ఫుల్ వేరియంట్ బయట పడింది.

 Movies On The Name Of Omicron Virus Details, Omicron, Corona Virus, Corona Varia-TeluguStop.com

సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ అనే ఈ నూతన వేరియంట్ ను కనుగొన్నారు పరిశోధకులు.అయితే ఒమిక్రాన్ గతంతో పోల్చితే మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్ లోనూ ఒకటి రెండు నమోదు అయినట్లు తెలియడం ఆందోళన కలిగిస్తుంది.అయితే ఒమిక్రాన్ పేరిట ఇప్పటికే పలు సినిమాలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

దీనికి సంబంధించి ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశాడు.ఒమిక్రాన్ అనేది ఓ ఇటాలియన్ మూవీ అని చెప్పాడు.

దీంతో ఈ పేరుతో వచ్చిన సినిమాలు ఏంటి? అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.

నిజానికి ఒమిక్రాన్ సినిమాకు, తాజాగా వచ్చిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కు అసలు సంబంధం లేదు.

ఈ సినిమాలో కరోనా లాంటి వైరస్ ప్రస్తావన లేదు.ఓ కంపెనీలో పని చేస్తున్న మనిషి ఓ ప్రమాదంలో చనిపోతాడు.

మళ్లీ బతుకుతాడు.అతడి దేహాన్ని ఓ ఏలియన్ ఆవహించినట్లు తెలుస్తోంది.

భూమిని ఆక్రమించుకునేందుకుగాను.ఒమిక్రాన్ గ్రహవాసులు ఇక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు పంపిన ఏలియన్ చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం.

ఏవో సిగ్నల్స్ చూపించడం ఈ సినిమాలో ఉంటుంది.అది కూడా అంత గొప్పగా ఏం ఉండదు.

Telugu Aliens, Anand Mahindr, Corona, Italian, Omicron, Africa, Planet Omicron-M

అటు ది విజిటర్‌ ఫ్రం ప్లానెట్‌ ఒమిక్రాన్‌ అనే పేరుతో 1963 లోనే ఒక సినిమా కూడా ఉంది.ఒమిక్రాన్‌ గ్రహం నుంచి వచ్చిన ఓ గ్రహాంతర వాసికి భూమ్మీద ఉన్న ఓ మహిళకు మధ్య ఏర్పడే స్నేహాన్ని ఈ సినిమాలో చూపించారు.భూమిని నాశనం చేయాలి అనుకునే ఒమిక్రాన్ వాసుల దగ్గరికి సదరు మహిళను తీసుకెళ్లడం అనేది కథ.ఈ సినిమాను అత్యంత కామెడీగా రూపొందించారు.

Telugu Aliens, Anand Mahindr, Corona, Italian, Omicron, Africa, Planet Omicron-M

భూమ్మీద పంటలను నాశనం చేసేందుకు ఓ వైరస్ ను ఏలియన్ వదులుతుంది.ఆ మహిళ తాను పెంచే పంటలను రక్షించి విజయం సాధిస్తుంది.ఇది కూడా మామూలు సినిమానే.ఒమిక్రాన్ అనే పేరు మరికొన్ని సినిమాల్లో కూడా వినిపిస్తుంది.ఒమిక్రాన్ పేరుతో ఓ గ్రహం ఉన్నట్లు మాత్రం ఆయా సినిమాల్లో చూపించారు.ప్రస్తుతం కరోనా పుణ్యమా అని మళ్లీ ఒమిక్రాన్ సినిమాలను సెర్చ్ చేస్తున్నారు జనాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube