రోజుకు ఇక మూడు ఆటలేనా?

గత రెండు నెలలుగా థియేటర్లలో బొమ్మ పడలేదు.ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఈ పరిస్థితిని థియేటర్లు ఎదుర్కొంటున్నాయి.

 Only Three Shows Play In Movie Theaters, Tollywood, Movie Theaters, Telangana Go-TeluguStop.com

మరో రెండు నెలల పాటు కూడా థియేటర్లలో బొమ్మ పడబోవడం లేదు.ఆగస్టు నుండి ఆంక్షల మద్య థియేటర్లు ఓపెన్‌ అవ్వబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

జూన్‌ మొదటి వారం నుండి షూటింగ్స్‌కు అనుమతించి ఆగస్టులో థియేటర్లకు అనుమతించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

థియేటర్లు ఓపెన్‌ అయినా కూడా ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

మొదటి నెల రెండు నెలలు ప్రేక్షకులు థియేటర్ల వైపుకు చూస్తారా లేదా అనేది అనుమానమే.ఇలాంటి సమయంలో ప్రభుత్వం పలు ఆంక్షలను థియేటర్లకు విధించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటి వరకు థియేటర్లలో నాలుగు ఆటలు పడేవి.కాని ఇకపై కేవలం మూడు ఆటలతోనే సినిమాలు నడవాలని నిర్ణయించారు.

Telugu Coronavirus, Lock, Theaters, Telangana, Tollywood-Movie

థియేటర్లలో సామాజిక దూరం పాటించి కేవలం 75 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది.ఇలా అయితే సినిమా వారికి చాలా నష్టం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాభం వ్యక్తం అవుతుంది.అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పడం లేదని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు.మల్టీప్లెక్స్‌ల్లో కూడా ఇదే పద్దతి అమలులో ఉండబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube