థియేటర్లు జనవరి వరకు కష్టమే అని తేల్చేసిన సురేష్ బాబు

కరోనా కష్టకాలం చిత్రపరిశ్రమకి చాలా ఇబ్బందికరంగా మారింది.ఈ కరోనా పరిస్థితుల కారణంగా గత ఆరు నెలల నుంచి థియేటర్లు మూతపడి ఉన్నాయి.

 Movie Theaters Reopening After 2020, Tollywood, Indian Cinema, Kollywood, Bollyw-TeluguStop.com

సినిమా షూటింగ్ లు పూర్తిగా బంద్ అయిపోయాయి.దీంతో చిత్ర పరిశ్రమ మీద ఆధారపడే వేల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

సినిమా షూటింగ్ లు లేకపోవడం వలన జూనియర్ ఆర్టిస్ట్ లు, చిన్న చిన్న టెక్నికల్ సిబ్బంది అందరికి పని పోయింది.అలాగే థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలని నమ్ముకొని ఎంతో మంది పని చేస్తున్నారు.

వారందరికీ ఉపాధి పోయింది.ఇక థియేటర్లు మూతబడిపోవడంతో, థియేటర్ యజమానుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే మారింది.

అదే స్థాయిలో నిర్మాతలు అయితే వందల కోట్ల రూపాయిలు నష్టపోవాల్సిన పరిస్థితి.దేశ వ్యాప్తంగా చూసుకుంటే చిత్ర పరిశ్రమ మూతపడటంతో వేల కోట్ల రూపాయిలు నష్టాలు కనిపిస్తున్నాయి.

అదే సమయంలో లక్షల సంఖ్యలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.

అయితే ఈ కష్టకాలం మరికొంత కాలం ఉంటుందని ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

ఇక తాజాగా నిర్మాత సురేష్ బాబు కూడా థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడు.ప్రస్తుతం కరోనా విపరీతంగా వ్యాపిస్తుందని, థియేటర్లు ఓపెన్ చేస్తే అవే కరోనాని వ్యాప్తి చేసే కేంద్రాలుగా మారిపోతాయని అన్నారు.

ఇలాంటి పరిస్థితిలో ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేయడం జరిగే పని కాదని, కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు గాని, లేదంటే ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు మూతబడే ఉంటాయని, వీటిలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు.దీంతో ఇక థియేటర్ లో సినిమాలు రిలీజ్ చేసుకోవాలనే వారి ఆలోచనలకి సురేష్ బాబు మాటలు పూర్తిగా ఇబ్బందులలో పడేశాయి.

ఇప్పుడు వారికి ఒటీటీ తప్ప సినిమా రిలీజ్ కి మరో ప్రత్యామ్నాయం లేదు.ఈ పరిస్థితిలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube