సక్సెస్‌ అయినా.. కలెక్షన్స్‌ ఏవీ?

శర్వానంద్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో తెరకెక్కి తాజాగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ చిత్రం సక్సెస్‌ టాక్‌ను దక్కించుకుంది.చిత్రంపై నమ్మకంతో ఈ చిత్రాన్ని భారీ పోటీ ఉన్నా కూడా సంక్రాంతికే విడుదల చేశారు.

 Movie Success But Where Is The Collections Of Express Raja-TeluguStop.com

ఈ సినిమా ముందు నుండి అనుకుంటున్నట్లుగానే పెద్ద సినిమాల మధ్య నలిగి పోతుంది.సక్సెస్‌ టాక్‌ వచ్చినప్పటికి మూడు బడా చిత్రాలు ఉండటం వల్ల ఈ సినిమాకు కలెక్షన్స్‌ అంతంత మాత్రంగానే వస్తున్నాయి.

ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కడంతో నిర్మాతలకు నష్టాలు వచ్చే ఛాన్స్‌ లేదు.కాని మరేదైనా సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉంటే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చి ఉండేవి అనేది ట్రేడ్‌ వర్గాల విశ్లేషణ.

‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చిత్రం సంక్రాంతికి కాకుండా ముందు లేదా కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే బాగుండేదని ఇప్పుడు చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం అంటున్నారు.ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వల్లే ఈ పరిస్థితి ఏర్పడ్డదంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా మీడియా వారితో అంటున్నారు.

‘నాన్నకు ప్రేమతో’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలు సక్సెస్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు ‘డిక్టేటర్‌’ చిత్రం కూడా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి.సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్‌రాజాకు ఇక కలెక్షన్స్‌ రావడం కష్టమే అని అంటున్నారు.

కొన్ని సార్లు సక్సెస్‌ అయినా కలెక్షన్స్‌ రావు అనేందుకు ఈ చిత్రమే ఉదాహరణ.ఈ చిత్రం ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని వేరే చిత్రాలను విడుదల చేయాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube