సోషల్ మీడియాలో ఉపాధిని పొందుతున్న సినీ తారలు..!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలు లేకపోవడంతో అందరూ సోషల్ మీడియా బాట పట్టారు.ఇందులో ప్రముఖంగా గాయకులు, గాయకురాలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా అనేకమంది సినీ వర్గానికి చెందిన చాలా మంది సోషల్ మీడియా బాట పట్టారు.

 Tollywood Actors Earning Money Through Social Media, Social Media, Tollywood Act-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం వరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగకపోవడంతో ఆదాయాన్ని ఆర్జించలేకపోయారు.అంతే కాదు మరి కొందరు అటు టీవీ రంగంలోనూ ఇటు వెండితెరపై స్థానాన్ని సంపాదించడం కోసం సోషల్ మీడియాను ఫర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ గా చేసుకొని అనేక రకాల ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు.

అదృష్టం బాగుండి ఒక్క వీడియో హిట్ అయిందంటే చాలు వారు రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోతారు.ఇలా చాలా మంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తులు వెండితెరపై కూడా కనిపిస్తుండటం అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం.

ఇలా ఇప్పటికే ఎంతోమంది ఇది చాలా రకాలుగా ఉపాధిని పొందుతున్నారు.

ఇకపోతే ఇప్పటికే యూట్యూబ్ లో సింగర్స్ గీతామాధురి, శ్రావణ భార్గవి.

అలాగే యాక్టర్స్ శివబాలాజీ, ఆదర్శ్ బాలకృష్ణ… ఇలా అనేక మంది వారు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో తెలుగు వారికి బాగా నచ్చే కంటెంట్ పెట్టడంతో అనేక మంది సబ్స్క్రైబర్స్ ను పొందడానికి ట్రై చేస్తున్నారు.సోషల్ మీడియాలో వచ్చే ఆదాయంతో ప్రస్తుతం చాలామంది జీవితాన్ని గడిపేస్తున్నారు.

వీరితో పాటు అనేక మంది రాబోయే నటీనటులు కూడా యూట్యూబ్ ప్రధానంగా చేసుకొని వారి టాలెంట్ ను అందులో పొందుపరుస్తున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా తెలిసిన కొందరు బిగ్ బాస్ షో కి కూడా ఎన్నికైన వారు ఉన్నారు.

ఇలా చాలా మంది యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా అనేక మార్గాల ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవడమే కాకుండా వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు.దీనికోసమే గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ లో అనేక మంది సినీ ప్రముఖులు కూడా వారికంటూ ఒక సపరేట్ ఛానల్ ని క్రియేట్ చేసుకుని అందులో గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బాగా సంపాదిస్తున్నారు.

దీంతో ఆదాయానికి బాగా అలవాటు పడిన ప్రముఖులు ఆడియన్స్ కు మరింత దగ్గర కావడానికి తహతహలాడుతున్నారు.ఇలా సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవడమే కాకుండా ఒకవైపు ఆదాయం, మరోవైపు కొత్త కొత్త అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎంతో మంది ప్రముఖులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube