వినూత్న ప్రయోగం, సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో సీన్స్‌  

Movie Special Promotion In Social Media-mallesam Life Story,mallesham Movie,mallesham Movie Promotions,padma Award Winner Mallesam

చేనేత కార్మికుల కష్టాలను తొలగించేందుకు చింతకింద మల్లేశం చేసిన ఆసు యంత్రంకు అపూర్వ ఆధరణ దక్కడంతో పాటు, దాన్ని తయారు చేసినందుకు గాను మల్లేశంకు ఏకంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ఇచ్చిన విషయం తెల్సిందే. మల్లేశంకు దక్కిన గౌరవంను ప్రతి ఒక్కరు అభినందిస్తూ ఉన్నారు. అలాంటి మల్లేశం జీవిత కథను తీసుకుని కమెడియన్‌ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘మల్లేశం’. .

వినూత్న ప్రయోగం, సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో సీన్స్‌-Movie Special Promotion In Social Media

ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మల్లేశం చిత్రంను అప్పుడే ప్రీమియర్‌ షోల ద్వారా జనాల్లోకి తీసుకు వచ్చారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ప్రీమియర్‌ ద్వారా సినిమాను చూపించడం జరిగింది.

ఇప్పుడు సినిమాను యూట్యూబ్‌ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాలోని కీలకమైన 45 నిమిషాల నిడివి సీన్స్‌ను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయాలని నిర్ణయించారు. ఇది సాహసంతో కూడిన నిర్ణయం. అయినా కూడా సినిమా ప్రమోషన్‌ కోసం తప్పడం లేదని యూనిట్‌ సభ్యులు అంటున్నారు..

ఇది ఫక్త్‌ కమర్షియల్‌ సినిమా కాదు కనుక సీన్స్‌ను విడుదల చేసినా కూడా సమస్య ఉండదనేది దర్శకుడు రాజ్‌ ఆర్‌ అభిప్రాయం. సినిమాకు పబ్లిసిటీ వచ్చి, సినిమాపై ఆసక్తి పెరిగి సినిమాను చూసేందుకు జనాలు ఎగబడతారు అనేది ఆయన అభిప్రాయం కావచ్చు. అందుకే యూట్యూబ్‌తో పాటు సోషల్‌మీడియాలో బిట్స్‌ బిట్స్‌గా ఈ సినిమాను పోస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.