అందరి చూపు రామోజీ ఫిల్మ్‌ సిటీ వైపే  

Movie Shootings Ramoji Film City - Telugu Hyderabad, Movie Shootings In Ramoji Film City, Out Door Shootings, Prabhas20 Movie

ఈవారమో లేదంటే వచ్చే వారమో ఖచ్చితంగా సినిమాల షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వబోతున్నారు.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో షూటింగ్స్‌ ఒక మోస్తరుగా జరుగుతూనే ఉన్నాయి.

 Movie Shootings Ramoji Film City

త్వరలోనే తెలుగు సినిమాకు కూడా క్లాప్‌ పడటం ఖాయంగా కనిపిస్తుంది.బుల్లి తెర షూటింగ్స్‌తో పాటు వెండి తెర షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

అయితే ఔట్‌డోర్‌ షూటింగ్స్‌కు మాత్రం అనుమతులు అస్సలు ఉండక పోవచ్చు.
షూటింగ్స్‌ పలు కండీషన్స్‌తో జరగాల్సిందిగా ప్రభుత్వాలు సూచించబోతున్నాయి.

అందరి చూపు రామోజీ ఫిల్మ్‌ సిటీ వైపే-Movie-Telugu Tollywood Photo Image

కనుక స్టూడియోలకు పరిమితం అయ్యి షూటింగ్స్‌ నిర్వహించాలని మేకర్స్‌ భావిస్తున్నారు.ఉదాహరణకు ప్రభాస్‌ 20 చిత్రం యూరప్‌లో చిత్రీకరణ చేయాల్సి ఉంది.

కాని అక్కడకు ఇప్పట్లో వెళ్లలేని పరిస్థితి ఉంది.కనుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో యూరప్‌ లొకేషన్స్‌ సెట్స్‌ నిర్మించి ఇక్కడే కానివ్వనున్నారు.

పెద్ద పెద్ద సెట్స్‌కు రామోజీ ఫిల్మ్‌ సిటీ అనువైన ప్రాంతం.కనుక రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే షూటింగ్స్‌ నిర్వహించాలని పెద్ద సినిమాల మేకర్స్‌ అప్పుడే చర్చలు జరుపుతున్నారు.

త్వరలోనే రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ సందడి ప్రారంభం కాబోతుంది.రామోజీ ఫిల్మ్‌ సిటీతో పాటు అన్న పూర్ణ ఇంకా రామానాయుడులో కూడా షూటింగ్స్‌ జరుగనున్నాయి.చిన్న స్టూడియోలు కూడా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉండనున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Movie Shootings Ramoji Film City Related Telugu News,Photos/Pics,Images..

footer-test