ఈ కండీషన్స్‌తో షూట్‌ చేయడం కంటే ఇంకొన్ని రోజులు ఆగడమే బెటర్‌

దేశ వ్యాప్తంగా షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి.లాక్‌డౌన్‌ 5.0లో షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చినా కూడా సవాలక్ష కండీషన్స్‌ పెడతారని తెలుస్తోంది.

 Movie Shootings Ok But  Conditions Apply , Tollywood, Cinima Shootings, Lock Dow-TeluguStop.com

రాత్రి సమయంలో షూటింగ్‌కు నో పర్మీషన్‌. అలాగే పాతిక నుండి ముప్పై మంది కంటే ఎక్కువ మంది ఉండొద్దు.

మేకప్‌ మన్‌ మరియు కాస్ట్యూమ్స్‌ డిజైనర్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా 60 ఏళ్లు దాటిన వారు షూటింగ్‌లో పాల్గొనవద్దు.

Telugu Cinima, Serieals, Small, Tollywood, Web-Movie

ఇలాంటివి సవాలక్ష కండీషన్స్‌తో సినిమా షూటింగ్‌ అంటే సాధ్యం అయ్యే విషయం కాదు.సీరియల్స్‌ వెబ్‌ సిరీస్‌ల షూటింగ్‌ అంటే ఏమో కాని భారీ సినిమాల షూటింగ్‌కు కనీసం 50 మంది లేకుండా అయితే పనే కాదు.ఇక పలు ప్రాంతాల్లో షూటింగ్స్‌ ఔట్‌ డోర్‌ యూనిట్స్‌ ఇలా సవాలక్ష ఉంటాయి.

అవన్నీ కాదని ఇండోర్‌లో కండీషన్స్‌ మద్య సినిమా షూట్‌ ఎలా చేస్తామంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

చిన్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, సీరియల్స్‌, రియాల్టీ షోలు ఇలా కొన్నింటి షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది.

త్వరలోనే ఈ ఆంక్షలు ఎత్తేస్తే పెద్ద సినిమాలు కూడా షూటింగ్స్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఒకటి రెండు పెద్ద సినిమాలు మినహా మిగిలిన సినిమాలన్నీ కూడా ఆగస్టు వరకు వేచి చూసే అవకాశం ఉందని అంటున్నారు.

మొత్తానికి ఈ ఏడాది మొత్తం సినిమాలకు కష్టాలే కష్టాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube