కొత్త కాన్సెఫ్ట్ తో జనాల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తున్న సినిమాల ప్రమోషన్..

నలుగురిలో నారాయణ అంటే మనకేం స్పెషాలిటీ ఉంటుంది? మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలి.అప్పుడే నలుగురిలో మనమేంటో తెలుస్తుంది.

 Movie Promotions With Great Concept , Movie, Rrr , Kalavathi, Liger Movie, Radhe-TeluguStop.com

తాజాగా సినిమా ప్రమోషన్లు కూడా ఇలాగే ఉన్నాయి.అన్ని సినిమాల మాదిరి కాకుండా తమకంటూ ఓ ప్రత్యేకత చూపించుకుంటున్నారు ఫిల్మ్ మేకర్స్.

తమ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా రాధే శ్యామ్ సినిమా సరికొత్త పద్దతిని జనాల్లోకి తెచ్చింది.

ఇంకో నెలలో ఈ సినిమా విడుదల ఉంది.ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో ప్రత్యేకత చూపుతుంది.

రాధేశ్యామ్ లవ్ స్టోరీ అయినందు వల్ల వాలంటైన్స్ డే రోజు పార్టీ ఏర్పాటు చేసింది.ఫిబ్రవరి 14 రాత్రి 8 గంటలకు హైదరాబాద్ క్లబ్ లో ఈ థీమ్ పార్టీ జరగనుంది.

ఇందులో సినిమా యూనిట్ పాల్గొననుంది.

అటు రాజమౌళి సినిమాకు సంబంధించి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లు మళ్లీ జోరందుకున్నాయి.

సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్నా.మార్చి ఎండింగ్ కు వాయిదా పడింది.

తాజాగా మళ్లీ ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.అందులో భాగంగానే తాజాగా సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలు పెట్టింది.

కొత్త కాన్సెప్ట్ తో జనాల్లో ఆసక్తి మరింత రేపుతుంది.అటు సర్కారు వారి పాట సినిమా మేలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ మొదలు పెట్టింది.తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి వరుసగా నాలుగు రోజులపాటు అప్ డేట్స్ ఇచ్చి.

జనాల్లో ఆసక్తి రేపింది.హీరోయిన్ కళావతిని రివీల్ చేసే సాంగ్ ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు.

అటు విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కూడా ఆగస్టులో విడుదల అవుతోంది.ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు జనాలతో పంచుకుంటుంది యూనిట్.లేటెస్టుగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు వాయిస్ మెసేజ్ ఇచ్చారు.అటు విజయ్ కూడా మంచి ప్రమోషన్ చేస్తున్నాడు.అటు ఈ వారం రవితేజ ఖిలాడీ రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే సినిమాలోని మేజర్ క్యారెక్టర్లను రివీల్ చేస్తూ వస్తోంది.

అటు టీజర్స్, లిరికల్ సాంగ్స్ తో జనాలను బాగా ఆకట్టుకుంటుంది.అటు వరుణ్ తేజ్ గని అనే సినిమాకు కూడా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గని టీం విజయవాడలో సందడి చేసింది.వాలంటైన్స్ డే సందర్భంగా ఓ క్రేజీ సాంగ్ కూడా విడుదల చేయబోతుంది.

Movie Promotions With Great Concept , Movie, Rrr , Kalavathi, Liger Movie, Radheshyam, Ravi Teja , Khiladi, Vijay Devarskonda, Rrr Movie, Rajamouli - Telugu Kalavathi, Khiladi, Liger, Concept, Radheshyam, Rajamouli, Ravi Teja, Rrr

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube