డేరా బాబా జీవితంపై సినిమా..ట్విస్ట్ ఇదే       2017-09-20   03:42:52  IST  Raghu V

డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం సింగ్. ఈ దొంగ బాబా విషయం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం అయ్యిందో వేరే చెప్పవలసిన అవవసరం లేదు. అత్యాచారం కేసులో జైలుపాలై 20 ఏళ్ల జైలు శిక్షకు గురైన డేరా బాబా అరెస్టు టైం లో ఎంత హడావిడి జరిగింది. ఏ హీరోకి ,ఏ క్రికెట్ స్టార్ కి కూడా అంత ఫాలోయింగ్ ఉండదు అనుకుంట. ఐతే ఆ టైం లో సుమారు 700 కార్ల హై సెక్యూరిటీ హై కోర్ట్ కి తీసుకెళ్ళిన సంఘటన,తద్వారా తన అనుచరులు,అభిమానులు లక్షల మంది రోడ్లమీదకి వచ్చి గొడవలు చేయడం వందలమంది గాయపడటం,పడులమంది చనిపోవడం..ఇలా అంతా ఒక సినిమాలా సాగిపోయింది.

ఇప్పుడు అదేతరహాలో డేరా బాబా జీవితం ఆధారంగా సినిమా తెరకేక్కుతోంది. బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ సినిమా తీసేందుకు సిద్ధమైంది. ఆమె సోదరుడు రాకేష్ సావంత్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డేరా బాబా పాత్రలో సంజయ్ గోరీ నటిస్తుండగా అతడి దత్త పుత్తికగా చెప్పబడుతున్న హనీ ప్రీత్ ఇన్సాన్ పాత్రను రాఖీ సావంత్ పోషిస్తోంది. ఈ సినిమాలో కేసు విచారణాధికారిగా ఎజాజ్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాని పూర్తి చేసి డిసెంబర్ లో మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ సినిమా పేరు ఏమిటంటే “ స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హో”. ఈ సినిమా రాఖీ సావంత్ నిర్మించడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. డేరా దత్త పుత్రికగా ఉన్న హనిప్రీత్ కూతురా లేక మరెలా చూపిస్తారు అనేది హాట్ టాపిక్ అయ్యింది.మొత్తానికి రాఖీ సావంత్..ఈ సినిమాతో డబ్బులు బాగా సంపాదించే ప్లాన్ వేసింది.మరి ఈ సినిమా రిలీజ్ అయ్యేలోగా ఎన్ని గొడవలకి దారితీస్తుందో చూడాలి

,