రామానాయుడు ఇక లేరు

ప్రముఖ నిర్మాత రామానాయుడు నేడు మద్యాహ్నం కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌ వ్యాదితో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామానాయుడు గారు నేడు తుది శ్వాస విడిచారు.

 Movie Moghul D Ramanaidu No More-TeluguStop.com

తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల్లో ఒక్కరైన రామానాయుడు దాదాపు 150కు పైగా సినిమాలు నిర్మించి గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ రికార్డును సాధించాడు.భారతీయ భాషలు అన్నింటిలో కూడా సినిమాలు నిర్మించిన రామానాయుడు గారు చనిపోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.

మూవీ మొఘల్‌గా పేరున్న రామానాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు కూడా పొందారు.భారతీయ సినిమాకు ఎంతో సేవ చేసిన ఈయనకు పద్మ అవార్డు కూడా కేంద్రం ప్రధానం చేసింది.

తెలుగులో ఎన్నో మరుపురాని సినిమాలను నిర్మించిన రామానాయుడు గారు 1936 జూన్‌ 6న జన్మించాడు.వెంకటేష్‌ ఇద్దరు కొడుకులు మరియు మనవల్లు కూడా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న రామానాయుడు గారు చనిపోవడంతో, తెలుగు సినిమా పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని సినీ ప్రముఖులు అంటున్నారు.రామానాయుడు మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన సన్నిహితులు, మిత్రులు ఆయన వద్ద పని చేసిన సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube