దర్శకేంద్రుడి క్రేజ్‌ ఇంకా ఏమాత్రం తగ్గలేదు గురూ

శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్ర రావు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.

 Movie Lovers Want More Movies From Raghavendra Rao Details, Movie News, Pellisan-TeluguStop.com

అద్బుత సినిమాలను ఆవిష్కరించిన ఆయన గొప్ప దర్శకుడిగా ఎన్నో సార్లు ప్రూవ్‌ అయ్యాడు.అద్బుతమైన సినిమాలతో పాటు ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకు దక్కింది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించినంత వరకు రాఘవేంద్ర రావు ఒక గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటారు.అలాంటి రాఘవేంద్ర రావు సినిమాలు చేయక చాలా ఏళ్లు అవుతుంది.

ఆయన దర్శకత్వంలో సినిమా కోసం ఇంకా కూడా అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు అంటూ తాజాగా ఆయన నిర్మించిన సినిమా తో క్లారిటీ వచ్చింది.

నిర్మాతగా రాఘవేంద్ర రావు పెళ్లి సందD ని నిర్మించిన విషయం తెల్సిందే.

ఆ సినిమా కు దర్శకత్వం వహించకున్నా కూడా ఆయన సారధ్యంలోనే సినిమా మొత్తం సాగింది.కనుక సినిమాను జనాలు చూసేందుకు ఎగబడ్డారు.సినిమా అట్టర్‌ ప్లాప్ టాక్ ను దక్కించుకుంది.అయినా కూడా దర్శకేంద్రుడు నటించిన సినిమా అవ్వడంతో పాటు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ అవ్వడం వల్ల సినిమాను పెద్ద ఎత్తున చూశారు.

Telugu Bad Reviews, Raghavendra Rao, Pellisandad, Rohan, Roshan, Sreeleela-Movie

మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.అదే విధంగా మరో రెండూ ముడు రోజులు వసూళ్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ ఈజీగా అయ్యేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నెట్టింట పెద్ద ఎత్తున ఈ సినిమా గురించిన బ్యాడ్‌ రివ్యూలు వచ్చినా కూడా కేవలం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి పేరు వల్ల సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది.అందుకే ఆయన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube