ఒకసారి జగన్ తో మాట్లాడవచ్చు కదా బాలయ్య

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి టాలీవుడ్‌ పై సీత కన్ను వేసినట్లుగా ఉన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.ఆయన థియేటర్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.

 Movie Industry People Want Balakrishna Meet Ys Jagan Mohan Reddy-TeluguStop.com

టికెట్ల రేట్లు పాతికేళ్ల క్రితం మాదిరిగా ఇప్పుడు ఉంటే సినిమాను తీయడం ఎలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో సినిమాను అస్సలు విడుదల చేయలేను అంటూ ఇటీవల సురేష్‌ బాబు చేసిన ప్రకటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రతి ఒక్కరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.సినిమా లు షూటింగ్‌ లు ముగిసినా కూడా ఏపీలో ఉన్న పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేస్తున్నారు.

 Movie Industry People Want Balakrishna Meet Ys Jagan Mohan Reddy-ఒకసారి జగన్ తో మాట్లాడవచ్చు కదా బాలయ్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా ల టికెట్ల రేట్ల విషయంలో పలువురు ఆయన్ను కలిసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు.జగన్‌ తో ఈ విషయం గురించి ఎవరు మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయంలో కొందరు ఉన్నారు.

ఈ సమయంలో కొందరు బాలయ్య పేరును ప్రస్థావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలయ్య ను జగన్ వద్దకు పంపించాలని కొందరు టాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య వంటి వారు వెళ్లి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను గురించి జగన్‌ తో చర్చిస్తే అప్పుడు ఆయన తప్పకుండా టికెట్ల రేట్ల విషయంలో తన మనసు మార్చుకుంటాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

సినిమా షూటింగ్‌ తో బిజీగా ఉంటున్న బాలయ్య ఎందుకు ఏపీ సీఎం జగన్‌ వద్దుకు వెళ్లి టికెట్ల రేట్ల విషయంలో ఫైట్‌ చేయడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.బాలయ్య అంటే జగన్ కు అభిమానం ఉంటుందట.అందుకే బాలయ్య అడిగితే ఏమైనా సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పేనా చూడాలి.

ప్రస్తుతం సినిమా లు థియేటర్లు ఓపెన్‌ ఉన్నా కూడా పెద్ద సినిమాలు విడుదలకు సిద్దంగా లేవు.వచ్చే నెలలో అయినా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వస్తాయేమో చూడాలి.

#Theaters #YS Jagan #Balakrishna #States Theaters #Ticket Rates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు